Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (17/12/2024)
Daily Horoscope Today In Telugu, December 17, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.
Daily Horoscope Today In Telugu, December 17, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.
మేషం
కార్యసాధనలో జాగ్రత్తగా వ్యవహరించాలి. విపరీతమైన అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా నష్టపోయే సూచన ఉంది. రక్త సంబంధీకుల గురించిన సమాచారం బాధిస్తుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి.
వృషభం
వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆలోచనలకు కార్యరూపమిస్తారు. ఆదాయం మెరుగవుతుంది. తోబుట్టువుల అండ లభిస్తుంది. కీలక వర్తమానం సంతోషాన్నిస్తుంది. ఆత్మీయులను కలుస్తారు. నూతనోత్తేజం పొందుతారు.
మిథునం
మనసులోని మాటను స్పష్టంగా చెప్పలేక ఇబ్బంది పడతారు. ముందుచూపు లేకుండా చేసే పనులు నష్టాన్ని కలిగిస్తాయి. రెండో పెళ్లి ప్రయత్నం వాయిదా వేయడం మంచిది. కీర్తి ప్రతిష్టలకు భంగం ఏర్పడే సూచన ఉంది.
కర్కాటకం
ఉత్సాహంగా గడుపుతారు. అభీష్టం నెరవేరుతుంది. విశిష్ట వ్యక్తిత్వంతో పెద్దల మన్ననలను పొందుతారు. నిరుద్యోగులకు శుభంగా ఉంటుంది. విందులకు హాజరవుతారు. ఆరోగ్యం బావుంటుంది. అదృష్టం వరిస్తుంది.
సింహం
చేపట్టిన పనులకు ఆటంకాలు పెరుగుతాయి. అనవసర పెట్టుబడుల వల్ల ఆర్థిక నష్టం గోచరిస్తోంది. పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రయాణాలను వాయిదా వేయండి. బంధువుల తీరు కలతను కలిగిస్తుంది.
కన్య
శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు. మిత్రులు తోడుంటారు. సంతాన సంబంధ వ్యవహారాలు సజావుగా ఉంటాయి. ఇష్టమైన వారితో విందులో పాల్గొంటారు. ఆకాంక్ష నెరవేరుతుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి.
తుల
ఇష్టకార్యం సఫలమవుతుంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమిస్తారు. ఉద్యోగస్తులు నైపుణ్యంతో పైఅధికారులను మెప్పిస్తారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. స్థిరనివాస యత్నం అనుకూలిస్తుంది.
వృశ్చికం
స్వల్ప ఒడుదుడుకులు ఎదురైనా పనులు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు అశ్రద్ధగా ఉంటే నష్టపోతారు. బలహీనతలను అధిగమించాలి. శత్రుపీడ పెరుగుతుంది. వృథా ఖర్చుంటుంది.
ధనుస్సు
నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరలేక పోతారు. అనవసర పట్టుదలకు పోయి ఆర్థికంగా నష్టపోతారు. కీలక నిర్ణయాల్లో ఆత్మీయుల సలహాను పాటించండి. వాహపం నడిపేటప్పుడు జాగ్రత్త. జీర్ణ సమస్య ఉంటుంది.
మకరం
ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రయాణం ఆనందాన్నిస్తుంది. కీర్తి పెరుగుతుంది. నిజాయితీకి తగ్గ గుర్తింపు లభిస్తుంది. సంతాన సంబంధ వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి.
కుంభం
అపోహలు తొలగిపోతాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. బలహీనతలను అధిగమిస్తారు. అదృష్టం తోడుంటుంది. వృత్తిపర జీవితం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మీనం
పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఇష్టకార్యం సఫలం కాదు. చింత పెరుగుతుంది. అపోహల వల్ల విరోధం పెరుగుతుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్త. వాత సమస్య వేధిస్తుంది.