Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (13/12/2024)

Daily Horoscope Today In Telugu, December 13, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

Update: 2024-12-13 00:42 GMT

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (13/12/2024)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత రుతువు, శుక్ల పక్షం

తిధి : త్రయోదశి రాత్రి గం.7.40 ని.ల వరకు ఆ తర్వాత చతుర్దశి

నక్షత్రం: భరణి ఉదయం గం.7.50 ని. లవరకు ఆ తర్వాత కృత్తిక రేపు తె.వా. 7.50 ని.ల వరకు

అమృతఘడియలు: అర్ధరాత్రి దాటిన తర్వాత గం. 3.28 ని.ల నుంచి గం.4.56 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.6.48 ని.ల నుంచి గం.8.20 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.39 ని.ల నుంచి గం. 9.36 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం. 12.20 ని.ల నుంచి గం.1.17 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం. 10.35 ని.ల నుంచి గం. 12.11 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.37 ని.లకు

సూర్యాస్తమయం :సా. గం. 5.44 ని.లకు

మేషం :

ఆటంకాలను అధిగమిస్తారు. ప్రయత్నాలు సఫలం అవుతాయి. అదృష్టం వరిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. ఆస్తి విక్రయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోండి.

వృషభం :

అనుకున్నవి నెరవేరతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం తగదు. సౌకర్యాలు సమకూరతాయి. విందుకు హాజరవుతారు. మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. కీర్తి పెరుగుతుంది.

మిథునం :

అభీష్టం సిద్ధిస్తుంది. అందరి సహకారాన్ని పొందుతారు. ఆత్మీయులతో విందుకు వెళతారు. సంతాన సంబంధ శుభ కార్యం గురించి చర్చిస్తారు. పెద్దల ఆశీస్సులను పొందుతారు. దూర ప్రాంతానికి వెళ్లాల్సి రావచ్చు.

కర్కాటకం:

యోగదాయకంగా ఉంటుంది. ఇష్టకార్యాలు ఆశించిన రీతిలోనూ ఫలితాలనిస్తాయి. బంధువులను కలుస్తారు. ప్రత్యర్థులపై గెలుస్తారు. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి.

సింహం :

కొన్ని ఒడుదుడుకులు వస్తాయి. యత్న కార్యం ఫలిస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. అవసరమైనంత డబ్బు అందుతుంది. ఉద్యోగులకు మెరుగ్గా ఉంటుంది. సామాజిక స్థితి మెరుగవుతుంది. మనశ్శాంతిని పొందుతారు.

కన్య :

ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకున్న రీతిలో పనులు సాగవు. ఉద్యోగులు, అధికారుల చివాట్లు తింటారు. సంతానం తీరు చికాకు పెడుతుంది. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. ఆరోగ్యంపై జాగ్రత్త వహించండి.

తుల :

భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. పనులు అనుకున్న స్థాయిలో జరుగుతాయి. శారీరక ఆనందం లభిస్తుంది. బంధాలు బలపడతాయి. కొత్త విషయాలను గ్రహిస్తారు. ప్రయాణం లాభిస్తుంది. ధనలాభం ఉంది.

వృశ్చికం :

వ్యవహార జయం ఉంది. స్వస్థాన ప్రాప్తి గోచరిస్తోంది. నూతన వస్తువులను కొంటారు. బంధువుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అనుమానం తీరుతుంది.

ధనుస్సు :

అడ్డంకులను దాటి పనులు సఫలం చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఒడుదుడుకులు ఉంటాయి. సంతానం తీరు ఆందోళన కలిగిస్తుంది. బంధువుల సహకారంతో సమస్యను పరిష్కరిస్తారు. కొత్త వస్తువులు కొంటారు.

మకరం :

ఏ విషయంలోనూ తొందరపాటు సరికాదు. బుద్ధి నిలకడగా ఉండదు. చెప్పుడు మాటల వల్ల సమస్యలు వస్తాయి. ఆస్తి అమ్మే ప్రయత్నం ఫలించదు. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. వృథా ఖర్చుల వల్ల దుఃఖం కలుగుతుంది.

కుంభం :

వ్యవహారాలన్నీ అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు బాగున్నా పెట్టుబడులకు అనుకూలం కాదు. నాయకత్వ లక్షణానికి ప్రశంసలు లభిస్తాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది.

మీనం :

ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అకారణ విరోధాలకు ఆస్కారం ఉంది. సమస్య పరిష్కారంలో సోదరుల సహకారం లభిస్తుంది. ఎవరికీ పూచీకత్తుగా ఉండకండి. ముఖ్యమైన సమాచారం ఆనందాన్నిస్తుంది. 

Tags:    

Similar News