Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (7/12/2024)

Telugu Horoscope Today, December 7, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

Update: 2024-12-06 20:03 GMT

Telugu Horoscope Today, December 7, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత రుతువు, శుక్ల పక్షం

తిధి: షష్ఠి ఉదయం గం.11.05 ని.ల వరకు ఆ తర్వాత సప్తమి

నక్షత్రం: ధనిష్ట సాయంత్రం గం.4.50 ని.ల వరకు ఆ తర్వాత శతభిషం

అమృతఘడియలు: ఉదయం గం.6.38 ని.ల నుంచి గం.8.12 ని.ల వరకు

వర్జ్యం: రాత్రి గం.11.48 ని.ల నుంచి అర్ధరాత్రి గం.1.21 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.6.44 ని.ల నుంచి గం.8.12 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం గం.9.21 ని.ల నుంచి గం.10.44 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.34 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 5.42 ని.లకు

మేషం 

తలపెట్టిన కార్యం దిగ్విజయం అవుతుంది. దీర్ఘకాలపు ఆకాంక్ష నెరవేరుతుంది. ధనలాభం ఉంది. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. విందుకు వెళతారు. బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం బావుంటుంది.

వృషభం 

అభీష్టం నెరవేరుతుంది. అన్ని ప్రయత్నాలూ అనుకూల ఫలితాలనిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త బాధ్యతలను చేపడతారు. క్రమశిక్షణతో విధులను నిర్వర్తిస్తారు. గౌరవం పెరుగుతుంది. ధనలాభం ఉంది.

మిథునం 

కార్యసాధనలో ఒడుదుడుకులు ఎదురవుతాయి. సంతానం తీరును విభేదిస్తారు. ఇంటికి దూరంగా వెళతారు. ఖర్చులను బాగా తగ్గించాలి. బాధ్యతల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. కడుపులో ఇబ్బందిగా ఉంటుంది.

కర్కాటకం

వ్యవహారాల్లో బాగా కష్టపడతారు. అనుకున్న స్థాయిలో ఫలితం రాదు. తగాదాలకు ఆస్కారముంది. చెడు ఆలోచనలను అదుపు చేయండి. పెద్దల కోపానికి గురవుతారు. పోటీలకు దూరంగా ఉండండి. ధననష్టముంది.

సింహం 

ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధువర్గాన్ని కలుస్తారు. కీర్తి వృద్ధి చెందుతుంది. ప్రయాణం లాభిస్తుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. బంధాలు బలపడతాయి. మనశ్శాంతిని పొందుతారు.

కన్య 

విజయవంతమైన రోజు. ప్రతి పనీ సులువుగా పూర్తవుతుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. అదృష్టం తోడుంటుంది. మనోధైర్యం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

తుల 

పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. ఇష్టకార్యం భంగమవుతుంది. తెలివితేటలకు తగిన గుర్తింపు ఉండదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. వృథాఖర్చు తగ్గించాలి. ప్రేమ వ్యవహారాలు ఫలించవు. విలువైన వస్తువులు జాగ్రత్త.

వృశ్చికం

కార్యనష్టం గోచరిస్తోంది. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. బుద్ధి నిలకడగా ఉండదు. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. స్థిరాస్తి రంగంలోని వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అవమానాలకు ఆస్కారముంది.

ధనుస్సు 

వ్యవహార జయం ఉంది. ఆర్థిక లబ్దిని పొందుతారు. ధైర్యసాహసాలతో చేపట్టే కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తాయి. నైపుణ్యంతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. మిత్రులు తోడుంటారు. నూతన వస్త్రాలను కొంటారు.

మకరం 

ఆటంకాల వల్ల వ్యవహారాలు చెడిపోతాయి. ఆర్థికంగా నష్టపోయే సూచన ఉంది. అనుకున్నవి సజావుగా సాగక పోవడంతో మనశ్శాంతి లోపిస్తుంది. వేళకు సరైన భోజనం ఉండదు. అకారణ విరోధాలకు ఆస్కారముంది.

కుంభం 

అభీష్టం నెరవేరుతుంది. చక్కటి తెలివితేటలతో పెద్దలను మెప్పిస్తారు. మెరుగైన జీవనం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అన్ని రంగాల వారికీ శుభంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. అదృష్టం వరిస్తుంది.

మీనం 

వ్యవహారాలు ఆశించినట్లుగా సాగవు. అనుకోని వృథా ఖర్చులుంటాయి. వ్యర్థప్రయాణాల వల్ల అలసిపోతారు. మిత్రులతో సఖ్యత చెడే సూచన ఉంది. పరిహారం చెల్లించాల్సి రావచ్చు. అనవసర జోక్యాలు మానుకోండి. 

Tags:    

Similar News