Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (02/12/2024)
Telugu Horoscope Today, December 02, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.
Telugu Horoscope Today, December 02, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత రుతువు, శుక్ల పక్షం
తిధి : పాడ్యమి మధ్యాహ్నం గం.12.43 ని.ల వరకు ఆ తర్వాత విదియ
నక్షత్రం: జ్యేష్ట మధ్యాహ్నం గం.3.45 ని.ల వరకు ఆ తర్వాత మూల
అమృతఘడియలు: లేవు
వర్జ్యం: అర్ధరాత్రి గం.12.04 ని.ల నుంచి గం.1.44 ని.ల వరకు
దుర్ముహూర్తం :మధ్యాహ్నం గం.12.26 ని.ల నుంచి గం.1.16 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.2.40 ని.ల నుంచి గం.3.30 ని.ల వరకు
రాహుకాలం : ఉదయం గం.7.41 ని.ల నుంచి గం.9.20 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం. 6.31 ని.లకు
సూర్యాస్తమయం :సా. గం.5.41 ని.లకు
మేషం :
పనుల పూర్తికి అడ్డంకులు ఎదురవుతాయి. ధన సంబంధ చికాకులుంటాయి. ఇంటికి దూరంగా వెళతారు. అయినవారితోనే విరోధం సూచిస్తోంది. ఓటమి భయం ఏర్పడుతుంది. వారసత్వపు ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త.
వృషభం :
పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వుంటుంది. ఆదాయం పెరిగినా, వృథా ఖర్చులుంటాయి. విందుకు హాజరవుతారు. ఉద్రేకాన్ని అణచుకోవాలి. ఉద్యోగులు, అధికారుల ఆగ్రహానికి గురవుతారు. తగాదాలు వద్దు.
మిథునం :
యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. న్యాయవివాదాలు పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులను కలుస్తారు. విజ్ఞానాభివృద్ధికి అనుకూలం. వ్యక్తిగత ఆకాంక్ష నెరవేరుతుంది.
కర్కాటకం:
పనులు అనుకున్నట్లే సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. బద్ధకిస్తే కార్యాలు చెడతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలించవు. సంతానం తీరు చికాకు పెడుతుంది.ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది.
సింహం :
వ్యవహారాలు అనుకున్న రీతిలో సాగవు. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త. స్థిరాస్తి, విద్యారంగాల్లోని వారు జాగ్రత్తగా ఉండాలి. చెడు ఆలోచనలను అదుపు చేయండి. కీలక నిర్ణయాల్లో ఆత్మీయులను సంప్రదించండి.
కన్య :
వ్యవహారాల్లో విశేష లాభాన్ని పొందుతారు. నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది. తోబుట్టువుల సమస్యలను పరిష్కరిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది.
తుల :
స్థిర చిత్తంతో చేసే పనులు ఫలిస్తాయి. బ్యాంకు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. నోటి దురుసును తగ్గించాలి.విడాకుల వ్యవహారాన్ని వాయిదా వేయండి. సోదరుల తోడ్పాటుతో కీలక కార్యం సఫలమవుతుంది.
వృశ్చికం :
అభీష్టం నెరవేరుతుంది. ధనలాభం ఉంది. వస్త్రాభరణాలను కొంటారు. విందులో పాల్గొంటారు. వివిధ రంగాల్లోని వారికి శుభ ఫలితాలుంటాయి. మనశ్శాంతిని పొందుతారు. ఎవరికీ పూచీకత్తులు ఇవ్వకండి.
ధనుస్సు :
అడ్డంకులను ఓపికగా అధిగమిస్తేనే పనులు పూర్తవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. విలువైన వస్తువులను కొంటారు. కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త.
మకరం :
చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. కొత్త స్నేహాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సంతాన సంబంధ సౌఖ్యాన్ని పొందుతారు. వృథా ప్రయాణం వాయిదా వేయండి. శుభకార్యాల్లో పాల్గొంటారు.
కుంభం :
అత్యంత యోగదాయకంగా ఉంటుంది. కార్యాలన్నీ సఫలమవుతాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చిస్తారు. ఆత్మీయులతో వినోదంగా గడుపుతారు. మనశ్శాంతి లభిస్తుంది.
మీనం :
అన్నింటా అనుకూల ఫలితాలు లభిస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో స్థిర వృద్ధి ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులను పొందుతారు.
శుభమస్తు