Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (31/12/2024)
Daily Horoscope Today In Telugu, December 31, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.
Daily Horoscope Today In Telugu, December 31, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.
మేషం
పనులు ఆశించిన రీతిలో సాగవు. ఆర్థిక ఇక్కట్లు ఉంటాయి. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతల నుంచి వైదొలగాల్సి రావచ్చు. గురు సమానులను కలుస్తారు. న్యాయ వివాదాలను నిర్లక్ష్యం చేయకండి.
వృషభం
కార్య నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీనష్టం భరించాల్సి వస్తుంది. తగాదాలకు దూరంగా ఉండండి. చెప్పుడు మాటలు నమ్మి ఎవరిపైనా చెడు అభిప్రాయాలు ఏర్పరచుకోకండి.
మిథునం
బంధాలు బలపడతాయి. ప్రయాణం ఆనందాన్నిస్తుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. అన్ని ప్రయత్నాలూ సఫలం అవుతాయి. మిత్రులతో విందుకు వెళతారు.
కర్కాటకం
శుభ ఫలితాలు లభిస్తాయి. మిత్రులు సహకరిస్తారు. స్వస్థాన ప్రాప్తి ఉంది. కొత్త వస్తువులను కొంటారు. అపార్థాలు తొలగి మనోవేదన తగ్గుతుంది. కీలక సమయంలో అదృష్టం తోడుంటుంది. ఆరోగ్యం బావుంటుంది.
సింహం
ఆటంకాలను దాటాల్సి వుంటుంది. అభీష్టం నెరవేరదు. మనోవ్యధ కలుగుతుంది. తెలివితేటలకు, మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లభించదు. ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. వృథా ఖర్చులను తగ్గించాలి.
కన్య
బుద్ధి నిలకడగా ఉండదు. తొందరపాటు నిర్ణయాల వల్ల కార్యాలు చెడిపోతాయి. అవమానమూ గోచరిస్తోంది. మనశ్శాంతి ఉండదు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించవు. ఆత్మీయులకు చెందిన సమాచారంఅందుతుంది.
తుల
అన్ని రకాలుగానూ శుభ ఫలితాలు లభిస్తాయి. సొంత తెలివితేటలు, సమర్థతతో కార్యాలను సాధిస్తారు. విశేష లాభాన్ని పొందుతారు. సోదరులతో సఖ్యత ఉంటుంది. కమ్యూనికేషన్ల రంగంలోని వారికి మేలుజరుగుతుంది.
వృశ్చికం
చెప్పుడు మాటలను నమ్మకండి. ఇచ్చిన మాట తప్పడం వల్ల అవమానం ఎదురవుతుంది. బ్యాంకు లావాదేవీలు ఆశించినట్లుగా సాగవు. వేళకు భోజనం ఉండదు. ముందుచూపు లేని కారణంగా నష్టపోతారు.
ధనుస్సు
చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విందుకు హాజరవుతారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కీర్తి పెరుగుతుంది. అదృష్టం తోడుగా ఉంటుంది.
మకరం
వ్యవహారాలు అనుకున్న రీతిలో సాగవు. బద్ధకం వల్ల మరిన్ని చిక్కుల్లో పడతారు. దూర ప్రయాణం ఉంది. వృథా ఖర్చులను బాగా తగ్గించుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. వేళకు భోజనం ఉండదు.
కుంభం
అభీష్టం నెరవేరుతుంది. రోజంతా సంతోషంగా గడుస్తుంది. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. ఇష్టులతో విందుకు హాజరవుతారు. శుభ కార్య నిర్వహణపై చర్చిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మీనం
ఎదిగేందుకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఇతరులతో విరోధం ఏర్పడినా విజయం మీకే దక్కుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.