Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (డిసెంబర్ 29 - జనవరి 4)

Weekly Horoscope in Telugu, 2024 December 29 to January 4: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Update: 2024-12-28 18:30 GMT

Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (డిసెంబర్ 29 - జనవరి 4)

Weekly Horoscope in Telugu, 2024 December 29 to January 4: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం

ఈవారమంతా అత్యంత యోగదాయకంగా ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. అన్నింటా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు సమర్థతకు తగ్గ గౌరవాన్ని పొందుతారు. వృత్తిపరమైన జీవితం పురోభివృద్ధి దిశలో ఉంటుంది. చక్కటి అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. రుణ విముక్తి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త బంధాలు బలపడతాయి. విందుల్లో పాల్గొంటారు. సంతాన సంబంధ శుభవార్తను వింటారు. ఆత్మీయుల కలయిక నూతనోత్తేజాన్ని నింపుతుంది.

పరిహారం: శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించండి. ఆకాశ నీలపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృషభం

వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. మీలోని నైపుణ్యానికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో అనుకున్న రీతిలో సౌకర్యాలు సమకూరవు. తగాదాలకు ఆస్కారం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది.

పరిహారం: పార్వతీదేవిని పూజించండి. కుంకుమ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మిథునం

భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. కీలక కార్యాల్లో జీవిత భాగస్వామి సహకారం ఉపయోగ పడుతుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రయాణం ఆనందాన్నిస్తుంది. ఇతరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సంతాన సంబంధ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త. చెప్పుడు మాటలను నమ్మకండి. తొందరపాటు నిర్ణయాల వల్ల చిక్కుల్లో పడతారు. ఇష్టం లేని పనిని చేయాల్సి వస్తుంది. జీర్ణ సంబంధ సమస్య వేధిస్తుంది. బాధ్యతల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. పుణ్యక్షేత్ర సందర్శనం ఉంది.

పరిహారం: సూర్యభగవానుడిని ఆరాధించండి. లేత నీలపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కర్కాటకం

శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం అవుతుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. ధర్మ మార్గంలో పయనిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలను చక్కదిద్దుతారు. బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కొత్త వస్తువులను కొంటారు. బలహీనతలను జయిస్తారు. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. చెడు ఆలోచనలను దగ్గరకు రానివ్వకండి. ఉద్యోగులు బాధ్యత నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం: గాయత్రీమాతను పూజించండి. ఎరుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

సింహం

అన్ని ఆటంకాలను తేలిగ్గా దాటేస్తారు. చేపట్టిన ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కొత్త వస్తువులు, ఆభరణాలను కొంటారు. మధ్యవర్తిత్వంతో సమస్యలు పరిష్కారం అవుతాయి. కోర్టు లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. అపార్థాలు తొలగిపోతాయి. అదృష్టం వరిస్తుంది. నిజాయితీకి, వృత్తి నిబద్ధతకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు ఉపకరిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. బద్ధకం వదిలి పెట్టాలి. సంతాన సంబంధ విషయాలు కొంత కలవర పరుస్తాయి. నిరాశ వద్దు.

పరిహారం: కనకదుర్గ అమ్మవారిని పూజించండి. ముదురు ఎరుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కన్య

మిశ్రమ ఫలితాలుంటాయి. కార్యసాధనలో అవరోధాలను అధిగమిస్తే శుభఫలితాలు దక్కుతాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తిగానే ఉన్నా, వృథా ఖర్చులు పెరుగుతాయి. విందుకు హాజరవుతారు. బంధువులతో వినోదంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆస్తి క్రయవిక్రయాలు మానసిక ఒత్తిళ్లను కలిగిస్తాయి. కీలకమైన గుట్టు రట్టయ్యే సూచన ఉంది. న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకునే వీలుంది. సంతానం తీరు చికాకు పెడుతుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎవరినీ అతిగా విశ్వసించకండి.

పరిహారం: శ్రీషణ్ముఖ స్వామిని పూజించండి. లేత పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

తుల

పనులు సులువుగానే పూర్తవుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. నూతన వస్త్రాభరణాలను కొంటారు. కీలక సందర్భాల్లో సోదరుల సహకారం మేలు చేస్తుంది. ముఖ్యమైన సమాచారం ఆనందాన్ని పెంచుతుంది. ఆత్మీయులను కలుస్తారు. నూతన ఉత్తేజాన్ని పొందుతారు. విధి నిర్వహణలో నాయకత్వ పటిమ ప్రశంసలను పొందుతుంది. వారసత్వపు ఆస్తి వ్యవహారాలు అనుకూలించవు. మనసును అదుపు చేసుకోండి. లేకుంటే, ఆత్మీయులతోనే గొడవలు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. విద్య, సేవారంగాల్లోని వారు జాగ్రత్త.

పరిహారం: శ్రీ లక్ష్మీనృసింహ స్వామిని పూజించండి. బంగారు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృశ్చికం

మిత్రుల తోడ్పాటుతో కీలక వ్యవహారంలో విజయం సాధిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. వృథా ఖర్చు తగ్గించండి. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆలోచనలకు ప్రశంసలు అందుతాయి. ఉద్యోగులు రివార్డులను పొందుతారు. ఇరుగు పొరుగుతో సఖ్యత పెరుగుతుంది. మాట తప్పడం వల్ల అవమానం ఎదురవుతుంది. కొత్తగా ఎవరికీ పూచీలు ఇవ్వకండి. రెండో పెళ్లి, విడాకుల వ్యవహారాలు వాయిదా పడతాయి. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. ఆలోచన విధానం మార్చుకోవాలి.

పరిహారం: శ్రీ దత్తాత్రేయుడిని పూజించండి. తెల్లటి రంగు కలిసిన దుస్తులను ధరించండి.

ధనుస్సు

వ్యవహారాలు అనుకున్న రీతిలోనే సాగుతాయి. ఆర్థిక చిక్కులు క్రమంగా తొలగిపోతాయి. నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తారు. సోదరుల తోడ్పాటు లభిస్తుంది. దీర్ఘకాలంగా ఎదురు చూస్తోన్న సమాచారం అందుతుంది. ఉత్సాహం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. కుటుంబానికి అవసరమైన వస్తువులను కొంటారు. సహోద్యోగులు, ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మాట తప్పడం వల్ల అవమానం ఎదురవుతుంది. కంటికి సంబంధించిన సమస్య వేధిస్తుంది.

పరిహారం: సాయిబాబా దర్శనం, శునకాలకు ఆహారం ఇవ్వండి. ఊదారంగు దుస్తులను ధరించండి.

మకరం

పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. అన్ని రంగాల్లోని వారికీ మేలిమి ఫలితాలు లభిస్తాయి. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. కీర్తి పెరుగుతుంది. విందులకు హాజరవుతారు. కొత్త విజ్ఞానాన్ని సంపాదిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ఆత్మీయుల వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. బద్ధకం వల్ల చిక్కుల్లో పడే సూచన ఉంది. నోటిదురుసు మంచిది కాదు.కీలక వ్యవహారంలో ముందుచూపు అవసరం.

పరిహారం: శ్రీశనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకించండి. నలుపు రంగు కలిసిన దుస్తులు ధరించండి.

కుంభం

అభీష్టాలు నెరవేరతాయి. ప్రయత్నించిన ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. ఆత్మీయుల నుంచి సహకారం లభిస్తుంది. ఇష్టమైన వారితో గడుపుతారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఆలోచన కార్యరూపం ధరించే సూచన ఉంది. సంతానం వృద్ధిలోకి రావడం ఆనందాన్నిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. వాహన యోగం ఉంది. శారీరక సౌఖ్యం లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త.

పరిహారం: లక్ష్మీనారాయణులను పూజించండి. బంగారు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మీనం

మేలిమి కాలం నడుస్తోంది. ముఖ్యమైన కార్యాలన్నీ ఫలవంతం అవుతాయి. అభీష్టం నెరవేరుతుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. మిమ్మల్ని వ్యతిరేకించే వారి నుంచే ప్రశంసలు పొందుతారు. అధికారుల ఆదరాభిమానాలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబ వ్యవహారాలు తృప్తికరంగా ఉంటాయి. కొత్త పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. రుణ విముక్తి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతాన సంబంధ వ్యవహారాలు గర్వపడేలా చేస్తాయి. దూర ప్రయాణం ఉంది. వేళకు భోజనముండదు. ఆరోగ్యం జాగ్రత్త.

పరిహారం: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. నలుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి. 

Tags:    

Similar News