Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (3/1/2025)
Daily Horoscope Today In Telugu, January 3, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.
Daily Horoscope Today In Telugu, January 3, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.
మేషం
ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. రుణ విముక్తి యత్నాలు కొలిక్కి వస్తాయి. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆకాంక్ష నెరవేరుతుంది. సంతాన సంబంధ సౌఖ్యం లభిస్తుంది.
వృషభం
మేలిమి అవకాశాలు అందివస్తాయి. స్థిర నిర్ణయంతో అన్ని కార్యాలనూ సఫలం చేసుకుంటారు. పెద్దల ఆదరాభిమానాలను పొందుతారు. సమర్థతకు తగ్గ గౌరవం లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.
మిథునం
కీలక వ్యవహారాలకు ఆటంకాలు వస్తాయి. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. త్వరగా అలసిపోతారు. ఇంటికి దూరంగా వెళతారు. పుణ్యక్షేత్ర సందర్శనం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
కర్కాటకం
అనవసరంగా పోటీలకు దిగకండి. ఓటమి పాలవుతారు. అనుకున్న రీతిలో పనులు జరగవు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అధికారులతో చివాట్లు తింటారు. తగాదాలు వద్దు. జీర్ణ సంబంధ సమస్య ఉంటుంది.
సింహం
అన్ని ప్రయత్నాలూ ఫలిస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. నిజాయితీకి తగిన ఫలితం దక్కుతుంది. ప్రయాణం లాభిస్తుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. మనశ్శాంతి లభిస్తుంది.
కన్య
వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. వివాదాల పరిష్కారంపై దృష్టి పెడతారు. అపార్థాలు తొలగిపోతాయి. కొత్త వస్తువులను కొంటారు. కీర్తి పెరుగుతుంది. మిత్రుల సహకారాన్ని పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది.
తుల
కార్యసాధనలో ఒడుదుడుకులు ఎదురవుతాయి. సోమరితనం వల్ల అభీష్టం నెరవేరదు. తెలివితేటలకు తగిన గుర్తింపు దక్కదు. ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్త. సంతానంతో సఖ్యత ఉండదు.
వృశ్చికం
బుద్ధి నిలకడగా ఉండదు. స్వజనులతోనే విరోధం గోచరిస్తోంది. మానసిక స్థిరత్వం లేని కారణంగా పనులను సవ్యంగా చేయలేరు. వృథా ఖర్చులు తగ్గించాలి. స్థిరాస్తి వ్యవహారాలను వాయిదా వేయండి. ఆరోగ్యం జాగ్రత్త.
ధనుస్సు
వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. స్వయంకృషికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. కీలక ఆర్థిక చికాకు తొలగిపోయే సూచన ఉంది. విశేష లాభం ఉంది. ఆత్మ ధైర్యం పెరుగుతుంది. సోదరుల సహకారం లభిస్తుంది.
మకరం
బ్యాంకు వ్యవహారాల్లో జాగ్రత్త. ఇతరుల వల్ల ఇబ్బందుల్లో పడతారు. అనవసర వివాదాల్లో చిక్కుకుంటారు. ముందుచూపుతో వ్యవహరించండి. ఖర్చులను తగ్గించాలి. వేళకు భోజనముండదు. కంటి సమస్య ఉంటుంది.
కుంభం
ఆశించిన ప్రయోజనాన్ని పొందుతారు. చక్కటి సౌకర్యాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విందులో పాల్గొంటారు. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. కీర్తి పెరుగుతుంది. అదృష్టం వరిస్తుంది.
మీనం
పనులు సవ్యంగా సాగక పోవడం విచారాన్ని కలిగిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. దూర ప్రయాణం గోచరిస్తోంది.