Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (28/12/2024)
Daily Horoscope Today In Telugu, December 28, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.
Daily Horoscope Today In Telugu, December 28, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.
మేషం
కష్టంగా అనిపించినా కార్యసాధనలో వెనుకడుగు వేయకండి. ఆటంకాలను అధిగమించాలి. పెద్దల కోపానికి గురయ్యే సూచన ఉంది. పైత్య సంబంధ సమస్య ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి..
వృషభం
ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన రీతిలోనే సాగుతాయి. బంధువులను కలుస్తారు. జీవిత భాగస్వామి సూచన మేలు చేస్తుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రయాణం లాభిస్తుంది.
మిథునం
వ్యవహారాలన్నీ సవ్యంగా సాగుతాయి. పోటీదారులపై విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి. కొత్త వస్తువులను కొంటారు. కీర్తి పెరుగుతుంది. విందుకు హాజరవుతారు. అపార్థాలు తొలగి పోతాయి.
కర్కాటకం
బద్ధకం వీడి కష్టపడాలి. అనవసర వివాదాల్లో తలదూర్చకండి. వేదన కలుగుతుంది. వృథా ఖర్చులను తగ్గించాలి. సమర్థతకు తగిన గుర్తింపుండదు. నిరాశ వదిలి ముందుకు సాగాలి. విలువైన వస్తువులు జాగ్రత్త.
సింహం
ప్రతి పనికీ అడ్డంకులు వస్తాయి. బుద్ధి నిలకడగా ఉండదు. బంధువులతో విరోధం గోచరిస్తోంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తల్లివైపు బంధువుల గురించిన సమాచారం వస్తుంది.
కన్య
రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. ఆశించిన ప్రయోజనాన్ని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. నాయకత్వ లక్షణానికి తగిన గుర్తింపుంటుంది. మిత్రులు తోడుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు.
తుల
ఆటంకాలను అధిగమించాల్సి వుంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. మాట తప్పడం వల్ల అవమానం ఎదురవుతుంది. వేళకు భోజనం ఉండదు. కుటుంబంలో చికాకులుంటాయి. కుడి కంటికి సమస్య వస్తుంది.
వృశ్చికం
అదృస్టం వరిస్తుంది. అన్ని పనులూ సవ్యంగా సాగుతాయి. వాహన యోగం ఉంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. ఎదిగేందుకు అవకాశాలు కలిసివస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం బావుంటుంది.
ధనుస్సు
అనుకున్న స్థాయిలో పనులు కావు. అనవసరపు ఖర్చులూ పెరుగుతాయి. బంధువులతో విరోధం సూచిస్తోంది. అనవసర ప్రయాణాలు మానుకోండి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. నిద్ర లేమి వేధిస్తుంది.
మకరం
ప్రతి కార్యమూ విజయవంతం అవుతుంది. ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది. కార్యసాధనలో ప్రత్యర్థులను జయిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. సంతాన సంబంధ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.
కుంభం
అన్ని పనుల్లోనూ అనుకూల ఫలితాలు ఉంటాయి. సమర్థతకు తగ్గ అధికార వృద్ధి ఉంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అభీష్టం నెరవేరుతుంది. ప్రభుత్వం నుంచి లబ్ధిని పొందుతారు.
మీనం
పనుల పూర్తికి అడ్డంకులు వస్తాయి. కొద్దిపాటి శ్రమతో వాటిని అధిగమిస్తారు. పెద్దలను కలిసి ఆశీస్సులను పొందుతారు. అనవసర జోక్యం వల్ల నష్ట పరిహారం చెల్లించాల్సి వస్తుంది. కోర్టు కేసులను నిర్లక్ష్యం చేయకండి.