Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (27/12/2024)
Daily Horoscope Today In Telugu, December 27, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.
Daily Horoscope Today In Telugu, December 27, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత రుతువు, కృష్ణ పక్షం
తిధి: ద్వాదశి అర్ధరాత్రి దాటిన తర్వాత తె.వా.గం.2.26 ని.ల వరకు ఆ తర్వాత త్రయోదశి
నక్షత్రం: విశాఖ రాత్రి గం.8.29 ని.ల వరకు అనూరాధ
అమృతఘడియలు: ఉదయం గం.10.49 ని.ల నుంచి మధ్యాహ్నం గం.12.35 ని.ల వరకు
వర్జ్యం: అర్ధరాత్రి గం.12.46 ని.ల నుంచి గం.2.29 ని.ల వరకు
దుర్ముహూర్తం: ఉదయం గం.8.58 ని.ల నుంచి గం.9.42 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.40 ని.ల నుంచి గం.1.24 ని.ల వరకు
రాహుకాలం: ఉదయం గం.10.50 ని.ల నుంచి గం.12.20 ని.ల వరకు
సూర్యోదయం: తె.వా. గం. 6.44 ని.లకు
సూర్యాస్తమయం: సా. గం.5.48 ని.లకు
మేషం
అడ్డంకులు ఎదురవుతాయి. అనుకున్న రీతిలో వ్యవహారాలు సాగవు. వారసత్వపు ఆస్తి వివాదం అసంతృప్తిని కలిగిస్తుంది. తగాదాలకు దూరంగా ఉండాలి. వ్యవహార నష్టాల వల్ల ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేస్తారు.
వృషభం
వ్యవహార జయం ఉంది. అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. ఆకాంక్ష నెరవేరుతుంది. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి.
మిథునం
అపార్థాలు తొలగిపోతాయి. కోర్టు వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కీలక వ్యవహారంలో బంధువుల తోడ్పాటు లభిస్తుంది. కీర్తి వృద్ధి చెందుతుంది.
కర్కాటకం
వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముందుచూపు లేమితో తీసుకునే నిర్ణయాలు చిక్కుల్లో పడేస్తాయి. సమర్థతకు తగ్గ గుర్తింపు లభించదు. ప్రేమ వ్యవహారాలు ఫలించవు. విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి.
సింహం
పని అనుకున్నట్లుగా సాగదు. మనసు నిలకడగా ఉండదు. బంధువులతో గొడవలొస్తాయి. ఖర్చు తగ్గించాలి. అవమానాలను ఎదుర్కొంటారు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కుటుంబ సభ్యుల తీరు వేదనకు గురిచేస్తుంది.
కన్య
రోజంతా దివ్యంగా ఉంటుంది. ఆశించిన ప్రయోజనం సిద్ధిస్తుంది. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. ఆత్మీయులను కలుస్తారు. నూతనోత్తేజాన్ని పొందుతారు. నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది.
తుల
వ్యవహారాల్లో ఆటంకాలు పెరుగుతాయి. బ్యాంకు లావాదేవీలు ఆశించిన రీతిలో ఉండవు. మాట తప్పడం వల్ల అవమానం ఎదురవుతుంది. వేళకు భోజనముండదు. కుటుంబంలో చిక్కులొస్తాయి. కంటి సమస్య ఉంటుంది.
వృశ్చికం
ఉత్సాహంగా గడుపుతారు. ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. విందుకు హాజరవుతారు. గౌరవం పెరుగుతుంది. కీలక సమయంలో అదృష్టం తోడుంటుంది. శారీరకసౌఖ్యం లభిస్తుంది.
ధనుస్సు
వ్యవహారాలు ఆశించిన స్థాయిలో సాగవు. ఆర్థిక వ్యవహారాలు తృప్తినివ్వవు. అనవసర జోక్యం వల్ల సమస్యలు పెరుగుతాయి. మిత్రుల సహకారం లభించదు. ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
మకరం
అన్ని పనులూ శుభప్రదంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. విందుకు హాజరవుతారు. సంతాన సంబంధ సౌఖ్యాన్ని పొందుతారు. ఆకాంక్ష నెరవేరుతుంది. రోజంతా సంతోషంగా ఉంటారు.
కుంభం
స్థిర చిత్తంతో చేసే ప్రతి పనీ సఫలమవుతుంది. పెద్దల అభిమానాన్ని పొందుతారు. మనోభీష్టం నెరవేరుతుంది. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.
మీనం
వ్యవహారాల్లో ఆటంకాలు వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన రీతిలో ఉండవు. బాధ్యతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.