Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (18/12/2024)

Daily Horoscope Today In Telugu, December 18, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

Update: 2024-12-17 20:48 GMT

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (18/12/2024)

Daily Horoscope Today In Telugu, December 18, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

మేషం

పనుల పూర్తికి బాగా కష్టపడాల్సి వుంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల పని చెడే అవకాశం ఉంది. మనసు నిలకడగా ఉండదు. ఖర్చులు పెరుగుతాయి. మాట తప్పడం వల్ల అవమానానికి గురయ్యే సూచన ఉంది.

వృషభం 

ధైర్యసాహసాలతో చేపట్టే పనుల్లో చక్కటి ఫలితాన్ని పొందుతారు. విశేష లాభం ఉంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్నిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అవసరమైనప్పుడు సహోదరుల తోడ్పాటు మేలు చేస్తుంది.

మిథునం 

కార్యసాధనలో అడ్డంకులు ఎదురవుతాయి. ప్రత్యర్థుల కుట్రల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. అకారణ విరోధం గోచరిస్తోంది. వేళకు సరైన భోజనముండదు. మాట తప్పడం వల్ల నిందలు వస్తాయి. మనశ్శాంతి లోపిస్తుంది.

కర్కాటకం

పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. అభివృద్ధి దిశగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గౌరవం పెరుగుతుంది. శారీరక సౌఖ్యాన్ని పొందుతారు. యుక్తితో కీలక సమస్యను పరిష్కరిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు.

సింహం

నిర్దేశించుకున్న రీతిలో పనులు పూర్తి కావు. ఆదాయానికి మించిన ఖర్చులు బాధిస్తాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం వల్ల భారీ పరిహారం చెల్లించాల్సి వస్తుంది.

కన్య 

ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. సంతాన సంబంధ సౌఖ్యాన్ని పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆకాంక్ష నెరవేరుతుంది.

తుల

వివిధ వృత్తుల్లోని వారికి యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ అలవాటు అవుతుంది. అవకాశాలను చేజార్చుకోకండి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల సహకారంతో అభీష్టకార్యం నెరవేరుతుంది.

వృశ్చికం 

ఉద్యోగులు బాధ్యతగా ఉండాలి. పైఅధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది. ఇంటికి దూరంగా ఉంటారు. సంయమనం పాటించండి. గురు సమానమైన వ్యక్తుల ఆశీస్సులను పొందుతారు. దైవచింతన పెరుగుతుంది.

ధనుస్సు

మనసుకి కష్టం కలిగించే ఘటనలు ఎదురవుతాయి. నిగ్రహాన్ని కోల్పోకండి. చెడు ఆలోచనలను దూరం చేసుకోండి. తగాదాలకు దూరంగా ఉండాలి. ఇష్టంలేని పని చేయాల్సి వస్తుంది. ఎలాంటి పోటీల్లో పాల్గొనకండి.

మకరం 

వ్యవహార జయం ఉంది. భాగస్వామ్య వ్యవహారం లాభిస్తుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రయాణం ఆనందాన్నిస్తుంది. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి సూచనను పాటించండి.

కుంభం

పనులన్నీ సవ్యంగా సాగుతాయి. ఆర్థిక లబ్దిని పొందుతారు. కొత్త వస్తువులను కొంటారు. అపార్థాలు తొలగి పోతాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శత్రువులను జయిస్తారు.

మీనం

ఆటంకాలను అధిగమిస్తేనే పనులు ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆందోళనను కలిగిస్తాయి. తెలివితేటలకు తగిన గుర్తింపు ఉండదు. సంతానం తీరు కోపాన్ని తెప్పిస్తుంది. బద్ధకాన్న వదిలి కృషి చేయండి.

ALSO READ: Telugu Panchangam Today: ఈరోజు పంచాంగం, తిథి, నక్షత్రం, డిసెంబర్ 18, 2024

Tags:    

Similar News