Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (14/12/2024)

Daily Horoscope Today In Telugu, December 14, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

Update: 2024-12-13 20:03 GMT

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (14/12/2024)

Daily Horoscope Today In Telugu, December 14, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

మేషం 

ఇతరుల కారణంగా ఇబ్బందుల్లో పడతారు. అనవసరంగా హామీనిచ్చి చిక్కులు తెచ్చుకుంటారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. కుటుంబ సమస్యలపై శ్రద్ధ వహించండి. వేళకు భోజనం ఉండదు. ఖర్చు పెరుగుతుంది.

వృషభం 

పనులు వేగంగా పూర్తవుతాయి. కీలక వ్యవహారంలో విజయం సాధిస్తారు. చక్కటి సౌకర్యం సమకూరుతుంది. గౌరవం పెరుగుతుంది. విందుకు హాజరవుతారు. తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. వాహనయోగం ఉంది.

మిథునం 

కార్యనిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి. బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త. ఆత్మీయుల ఆరోగ్యం కలవర పరుస్తుంది. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. మిత్రులు మీతో విభేదిస్తారు. బద్ధకం వద్దు.

కర్కాటకం

లక్ష్యాన్ని అవలీలగా చేరుకుంటారు. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సంతానం వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులను పొందుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

సింహం 

ఎదుగుదలకు తోడ్పాటు లభిస్తుంది. వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు.

కన్య 

పనులు అనుకున్న రీతిలో సాగవు. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ఆత్మీయుల విమర్శలు బాధిస్తాయి. ప్రయాణం చికాకు కలిగిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలను రూపొందిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.

తుల 

ప్రతి పనికీ అడ్డంకులు వస్తాయి. కార్యనష్టం ఉంది. లక్ష్యసాధనలో జాప్యం వల్ల ఆందోళన పెరుగుతుంది. ఇతరులపై దురభిప్రాయాలు ఏర్పడతాయి. తగాదాలకు దూరంగా ఉండండి. వేళకు భోజనం ఉండదు.

వృశ్చికం 

అభీష్టం నెరవేరుతుంది. నిజాయితీకి గుర్తింపు లభిస్తుంది. ఆనందం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. ఇతరులతోనూ చక్కటి సంబంధాలు ఏర్పడతాయి.

ధనుస్సు 

పనులు అనుకున్నరీతిలోనే సాగుతాయి. ధనలాభం ఉంది. బంధుమిత్రులు సహకరిస్తారు. కొత్త వస్తువులను కొంటారు. బలహీనతలను జయిస్తారు. అపార్థాలను తొలగించుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మకరం 

ఆటంకాల వల్ల పనులు నెమ్మదిస్తాయి. మీ బద్ధకం కూడా తోడవడంతో ఇష్టకార్యం భంగమవుతుంది. మనోవ్యధను కలిగిస్తుంది. నిరాశ చెందకుండా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

కుంభం 

స్వజనులతోనే విరోధం ఏర్పడుతుంది. బుద్ధి నిలకడ లేక.. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. స్నేహితుల నుంచి సరైన సహకారం లభించదు.

మీనం 

వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. ఆత్మీయులను కలుస్తారు. నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది. సోదరుల వృద్ధి గురించిన సమాచారం ఆనందాన్ని పెంచుతుంది.

Tags:    

Similar News