Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (4/12/2024)

Telugu Horoscope Today, December 4, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

Update: 2024-12-03 20:30 GMT

Telugu Horoscope Today, December 4, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు

Telugu Horoscope Today, December 4, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

మేషం

ఆర్థిక చిక్కుల పరిష్కారం ఆలస్యమవుతుంది. ఉద్యోగులకు నిర్లక్ష్యం తగదు. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. మనశ్శాంతి దూరమవుతుంది. గురువుల ఆశీస్సులు పొందుతారు. శత్రుపీడ పెరుగుతుంది.

వృషభం

చేపట్టిన పనులు సవ్యంగా సాగవు. ఆకస్మిక చిక్కులు వచ్చి పడతాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. ఇతరులపై చెడు అభిప్రాయాలు ఏర్పడతాయి. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. వేళకు భోజనముండదు.

మిథునం

అన్ని ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధాలు బలపడతాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. మానసిక శాంతి లభిస్తుంది. ప్రయాణం లాభిస్తుంది. సంతాన సంబంధ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. కీర్తి వృద్ధి చెందుతుంది.

కర్కాటకం

అడ్డంకులన్నీ తొలగిపోతాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థికంగా లబ్దిని పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా వుంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. న్యాయ వివాదాలు అనుకూలంగా సాగుతాయి.

సింహం

అడ్డంకులను అధిగమించాల్సి వుంటుంది. సంతానం తీరు కోపం తెప్పిస్తుంది. ఆలోచనలు వక్రమార్గంలో సాగుతాయి. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభించదు. అనవసర విరోధాలు ఏర్పడతాయి. బద్ధకం వీడాలి.

కన్య 

బంధువులతో విరోధం ఉంది. స్థిరాస్తి వ్యవహారాలను వాయిదా వేయండి. సహాయకుల వల్ల చిక్కులొస్తాయి. ఆంతరంగిక విషయాలు బాధిస్తాయి. కుటుంబవ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి. వాహన సంబంధ సమస్య వస్తుంది.

తుల 

ఆదాయం వృద్ధి చెందుతుంది. చేపట్టిన పనులు సవ్యంగా సాగుతాయి. మిత్రులు సహకరిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. మీ ఆలోచనలు పెద్దల ప్రశంసలకు పాత్రమవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

వృశ్చికం 

మనసులోని భావాన్ని స్పష్టంగా చెప్పలేక ఇబ్బంది పడతారు. ముందుచూపు లేని నిర్ణయాల వల్ల సమస్యలు వస్తాయి. బ్యాంకు లావాదేవీలు తృప్తినివ్వవు. నిందలు వస్తాయి. కంటి సమస్యను నిర్లక్ష్యం చేయకండి.

ధనుస్సు 

అన్ని కీలక సందర్భాల్లో అదృష్టం తోడుంటుంది. వ్యవహారాలన్నీ జయప్రదం అవుతాయి. కుటుంబ సభ్యులు మీ మనసులోని ఆలోచనల ప్రకారం నడచుకుంటారు. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మకరం 

పనులకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడతాయి. ఇతరులతో కలిసి చేసే పనుల విషయంలో జాగ్రత్త. వృథా ఖర్చు పెరుగుతుంది. దూర ప్రాంతానికి వెళతారు. బద్ధకాన్ని వదలాలి. నిద్రలేమి వల్ల ఇబ్బంది పడతారు.

కుంభం 

లక్ష్యాన్ని సులువుగా చేరుకుంటారు. కార్యసాధనలో మిత్రులు, సహచరులు సహకరిస్తారు. ధన సంబంధ చిక్కులు పరిష్కారమవుతాయి. సంతాన విషయాలు మనశ్శాంతినిస్తాయి. బంధువులతో విందుకు వెళతారు.

మీనం 

ప్రయత్నించిన కార్యం సఫలమవుతుంది. కొత్త బాధ్యతలను చేపడతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ప్రభుత్వ సంబంధ లబ్ది చేకూరుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. పోటీదారులపై విజయం సాధిస్తారు.

Tags:    

Similar News