Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (2/1/2025)
Daily Horoscope Today In Telugu, January 2, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.
Daily Horoscope Today In Telugu, January 2, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.
మేషం
అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి.కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఉద్యోగులు ప్రశంసలను అందుకుంటారు. ప్రయాణం లాభిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది.
వృషభం
ఆటంకాలు ఎదురైనా వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృథా ఖర్చులను తగ్గించాలి. సంతానం తీరు చికాకు పెడుతుంది. గురు సమానులను కలిసి ఆశీస్సులను పొందుతారు. ఆధ్యాత్మక ఆసక్తి వృద్ధి చెందుతుంది.
మిథునం
వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు నిర్ణయాలు సరికాదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ముఖ్యంగా నీటి వనరుల దగ్గరలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటకం
భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. జీవిత భాగస్వామి సూచనలను పాటించండి. ఆస్తిని కొనే ప్రయత్నం అనుకూలిస్తుంది. ప్రయాణం లాభిస్తుంది. మిత్రులు సహకరిస్తారు.
సింహం
వ్యవహారాలన్నింటా విజయం సాధిస్తారు. ఆర్థిక వృద్ధి గోచరిస్తోంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. విందుకు హజరావుతారు. గౌరవం వృద్ధి చెందుతుంది.
కన్య
సంతాన సంబంధ వ్యవహారాలు కోపాన్ని తెప్పిస్తాయి. వ్యవహారాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ఖర్చులను తగ్గించాలి. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. వారసత్వపు ఆస్తి వ్యవహారాలు వాయిదా వేయండి.
తుల
స్థిరాస్తి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. రియల్ ఎస్టేట్, సేవా రంగాల్లోని వారు కీలక నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. ఒత్తిడి పెరుగుతుంది.
వృశ్చికం
అభీష్టం నెరవేరుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. సోదరుల సహకారం లభిస్తుంది. ఇవాళ మీరు పొందే సమాచారం ఆనందాన్ని పెంచుతుంది. విందుకు హాజరవుతారు.
ధనుస్సు
బ్యాంకు వ్యవహారాలు ఆశించిన రీతిలో సాగవు. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. మాట తప్పడం వల్ల నిందలు పడాల్సి వస్తుంది. మనసులోని భావాన్ని స్పష్టంగా చెప్పలేక చివాట్లు తింటారు. ఆరోగ్యం జాగ్రత్త.
మకరం
శుభప్రదంగా సాగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సంతాన సంబంధ వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. బాల్య స్నేహితులతో గడుపుతారు. కీలక వ్యవహారాల్లో అదృష్టం తోడుగా నిలుస్తుంది.
కుంభం
ఆత్మీయుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వైద్యం కోసం ఖర్చుచేయాల్సి వస్తుంది. వ్యవహారాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి.
మీనం
కార్యం సఫలం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. బంధాలు బలపడతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా బావుంటుంది. సంతాన సంబంధ వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి.