Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (జనవరి 5 - జనవరి 11)
Weekly Horoscope in Telugu, 2024 January 5 to January 11: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Weekly Horoscope in Telugu, 2024 January 5 to January 11: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం
అవసరమైన సమయంలో అదృష్టం తోడుంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు శుభ ఫలితాలను పొందుతారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరే ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. తెలివితేటలకు తగ్గ గుర్తింపు ఉంటుంది. కీర్తి పెరుగుతుంది. సామాజిక అంశాలపై అవగాహన పెరుగుతుంది. ఆత్మీయుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. అసూయను వీడండి. తగాదాలకు దూరంగా ఉండండి. వ్యక్తిగత పూచీల వల్ల నష్టపోతారు. కుటుంబంపై శ్రద్ధ వహించాలి.
పరిహారం: శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించండి. ముఖ్య కార్యాలకు తెల్లటి వస్త్రాలను ధరించి వెళ్లండి.
వృషభం
వ్యవహారాలన్నీ శుభప్రదంగా సాగుతాయి. ఆర్థిక లబ్దిని పొందుతారు. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. రుణ విముక్తికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాల గురించి చర్చిస్తారు. ఆకాంక్ష నెరవేరుతుంది. కుటుంబ సభ్యుల తీరు గర్వపడేలా ఉంటుంది. మిత్రుల సహకారం తోడవుతుంది. వ్యక్తిత్వానికి ప్రశంసలు లభిస్తాయి. విందులో పాల్గొంటారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనూహ్య ఖర్చులుంటాయి. కంటి సమస్యను నిర్లక్ష్యం చేయకండి.
పరిహారం: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించండి. ముదురు ఆకుపచ్చ రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.
మిథునం
అన్ని ప్రయత్నాలూ ఫలిస్తాయి. ఎదుగుదలకు తగిన అవకాశాలు కలిసివస్తాయి. మిత్రులు సహకరిస్తారు. కొత్త బంధాలు బలపడతాయి. ఆర్థికంగా మెరుగైన పరిస్థితి వస్తుంది. రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వృత్తిపరమైన నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. విదేశాలలో స్థిరనావాసానికి చేసే యత్నాలు కొలిక్కి వస్తాయి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల ఎత్తులను ఓకంట కనిపెట్టి వుండండి.
పరిహారం: శ్రీ సూర్యభగవానుణ్ణి పూజించండి. లేత ఎరుపు రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.
కర్కాటకం
అభీష్టం నెరవేరుతుంది. దీర్ఘకాలంగా ఊరిస్తోన్న చక్కటి అవకాశం అందివస్తుంది. ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.. బంధుమిత్రులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త బంధాలు లాభసాటిగా ఉంటాయి. సంతాన సంబంధ శుభ కార్యాచరణ గురించి చర్చిస్తారు. పెద్దల ఆశీస్సులను పొందుతారు. ఖర్చులను బాగా అదుపు చేయాలి. పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు.
పరిహారం: శ్రీలక్ష్మీనృసింహ స్వామిని పూజించండి. ముదురు ఎరుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.
సింహం
వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కార్యనిర్వహణలో స్థిరత్వం పెరుగుతుంది. అభీష్టం నెరవేరుతుంది. ఇతరులతో విభేదాల్లో విజయం మీకే లభిస్తుంది. పెద్దల ఆదరాభిమానాలను పొందుతారు. ఉద్యోగులు శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబ గౌరవం పెరుగుతుంది. కొన్నిసార్లు ఇష్టంలేని పనులను చేయాల్సి వస్తుంది. ఉద్రేకాన్ని అదుపు చేసుకోండి. తగాదాలకు దూరంగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. పోటీలకు దిగకండి.
పరిహారం: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. కీలక పనికి, లేత నీలం రంగు కలిసిన దుస్తులు ధరించండి.
కన్య
కార్యాలన్నీ ఫలిస్తాయి. ధనవృద్ధి ఉంది. కొత్త వస్తువులను కొంటారు. ప్రయాణాలు వినోదాత్మకంగా సాగుతాయి. వృత్తిగత నైపుణ్యంతో పైఅధికారుల ప్రశంసలను పొందుతారు. వ్యాపార లావాదేవీలు తృప్తినిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. జీవిత భాగస్వామితో అనురాగం వృద్ధి చెందుతుంది. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. ఉద్రేకాన్ని అదుపు చేసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. వృథా ఖర్చులను తగ్గించండి. వాహనం నడిపేటప్పుడు మెళకువగా ఉండండి.
పరిహారం: శ్రీ గాయత్రీమాతను పూజించండి. కుంకుమ వర్ణం కలిసిన దుస్తులను ధరించండి.
తుల
వ్యవహార జయం ఉంది. ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. బంధువులు సంపూర్ణంగా సహకరిస్తారు. విందుల్లో పాల్గొంటారు. నూతన విషయాలను గ్రహిస్తారు. విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు అనువైన కాలం. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. అపార్థాలు తొలగిపోతాయి. ఈ ప్రయత్నంలో జీవిత భాగస్వామి సహకరిస్తారు. చెప్పుడు మాటలను నమ్మకండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. జీర్ణ సమస్య వుంటుంది.
పరిహారం: శ్రీ ఆంజనేయ స్వామిని పూజించండి. సిందూర వర్ణం కలిసిన దుస్తులను ధరించండి.
వృశ్చికం
పట్టింది బంగారంలా సాగుతుంది. ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. ఆర్థిక లావాదేవీల్లో శుభ ఫలితాలను పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. స్వేచ్ఛాజీవితాన్ని కోరుకుంటారు. పెట్టుబడులకు అనుకూల కాలమిది. భాగస్వామ్య వ్యవహారాలు బాగా లాభిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మానసిక వేదన తొలగిపోతుంది. సంతాన సంబంధ వ్యవహారంపై దృష్టి పెడతారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించండి.
పరిహారం: శ్రీ దక్షిణామూర్తిని ధ్యానించండి. కాషాయపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.
ధనుస్సు
కీలక వ్యవహారం ఫలిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సజావుగానే సాగుతాయి. ధర్మ మార్గంలో నడిచే వారికి తగిన శుభ ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. కొత్త వస్తువులను కొంటారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అపార్థాలు తొలగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్య, సేవారంగాల్లోని వారు జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి అమ్మే ప్రయత్నాలు బెడిసికొడతాయి. జీవితంలోని కీలక రహస్యం బట్టబయలయ్యే సూచన ఉంది. గొడవలు వస్తాయి. మానసిక ప్రశాంతత కరువవుతుంది.
పరిహారం: శ్రీశనైశ్చరుడిని నువ్వుల నూనెతో అభిషేకించండి. నల్లటి రంగు కలిసిన దుస్తులను దరించండి.
మకరం
వ్యవహారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. ఆత్మీయులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. నూతన ఉత్తేజాన్ని పొందుతారు. కొత్త వస్తువులను కొంటారు. కుటుంబ వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. బోళాతనం మంచిది కాదు. ముఖ్యంగా ఆస్తి క్రయవిక్రయాల్లో అప్రమత్తంగా ఉండండి. కీలక నిర్ణయాల్లో సోదరుల సహకారం తీసుకోండి. సంతాన సంబంధ వ్యవహారాలు చికాకు పెడతాయి. ఆరోగ్యం జాగ్రత్త.
పరిహారం: శ్రీకనకదుర్గమ్మను పూజించండి. పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.
కుంభం
వ్యవహారాల్లో విశేష లాభముంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వస్త్రాభరణాలను కొంటారు. సోదరులకు ఉపయోగపడే పనులను చేస్తారు. ధైర్యసాహసాలను, నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తారు. ఉద్యోగులు రివార్డులను పొందుతారు. కీలక సమాచారం అందుతుంది. ఆధ్యాత్మిక అంశాల ద్వారా ప్రేరణను పొందుతారు. ప్రయాణం అనుకూలిస్తుంది. అనవసర హామీలను ఇవ్వకండి. బ్యాంకు లావాదేవీలు వాయిదా పడతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల బంధువిరోధం ఏర్పడుతుంది. తల్లి ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టండి.
పరిహారం: శ్రీసుబ్రహ్మణ్యస్వామిని పూజించండి. లేత పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.
మీనం
యోగదాయకంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. కీలక వ్యవహారంలో అదృస్టం తోడుగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. జీవితంలో ఉన్నత స్థాయికి చేరేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తారు. సోదరులు అండదండగా నిలుస్తారు. ఎవరికీ పూచీగా ఉండకండి. ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు ప్రయత్నించండి. అనవసర జోక్యాలు వద్దు.
పరిహారం: శ్రీలక్ష్మీనారాయణులను పూజించండి. బంగారు రంగు కలిసిన దుస్తులను ధరించండి.