Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (30/12/2024)

Daily Horoscope Today In Telugu, December 30, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.

Update: 2024-12-29 21:00 GMT

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (30/12/2024)

Daily Horoscope Today In Telugu, December 30, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.


మేషం 

ప్రయాణం వల్ల లాభముండదు. బంధువుల వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించండి. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఖర్చులను బాగా తగ్గించాలి. దైవక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

వృషభం 

మీ బలహీనతలే ఇబ్బందిని తెచ్చి పెడతాయి. అనవసరంగా పోటీ పడకండి. విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది. వేళకు భోజనం ఉండదు. సహచరుల వైఖరి బాధిస్తుంది. వారసత్వపు ఆస్తి వ్యవహారాల్లో తొందరపాటు తగదు.

మిథునం 

ఆకాంక్ష నెరవేరుతుంది. సంతాన సంబంధ ఆనందాన్ని పొందుతారు. నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రయాణం లాభసాటిగా ఉంటుంది. బంధాలు బలపడతాయి.

కర్కాటకం

అడ్డంకులు తొలగిపోతాయి. చేపట్టిన కార్యం సజావుగా సాగుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. రాజీ మార్గంలో వివాదాన్ని పరిష్కరించుకుంటారు. శారీరక, మానసిక సౌఖ్యం లభిస్తుంది. ఆర్థికవృద్ధి గోచరిస్తోంది.

సింహం 

ముందు చూపుతో వ్యవహరించాలి. కార్య నిర్వహణలో పొరపాట్ల వల్ల ఇబ్బంది పడతారు. మీ తెలివితేటలకు, సమర్థతకు తగిన గుర్తింపు లభించదు. వృథా ఖర్చులను బాగా తగ్గించాలి. విలువైన వస్తువులను భద్రపరచండి.

కన్య 

ఆలోచన విధానం మారుతుంది. బుద్ధి స్థిరంగా ఉండదు. ఆత్మీయుల వ్యవహారాల్లో అతి జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చు, సకాలంలో డబ్బు చేతికి అందకపోవడం ఇబ్బందిని కలిగిస్తుంది. మనశ్శాంతి కరువవుతుంది.

తుల 

వ్యవహారాల్లో శుభ ఫలితాలు లభిస్తాయి. స్వయంకృషికి తగిన గుర్తింపు ఉంటుంది. ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఇరుగుపొరుగుతో సఖ్యత పెరుగుతుంది. సహచరులు సహకరిస్తారు. ఆత్మీయుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది.

వృశ్చికం 

కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విడాకులు, రెండో పెళ్లి ప్రయత్నాలు ఫలించవు. నిజాయితీతో మెలగడం వల్ల మేలు జరుగుతుంది. మాట తప్పితే అవమానం తప్పదు. వృథా ఖర్చులను బాగా తగ్గించండి.

ధనుస్సు 

ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లబ్ది చేకూరుతుంది. సునిశిత విశ్లేషణ విధానానికి తగిన గుర్తింపు ఉంటుంది. బాల్యస్నేహితులను కలుస్తారు. ప్రతిష్ట పెరుగుతుంది. ఇంటికి అవసరమైన సౌకర్యాలను సమకూరుస్తారు.

మకరం 

ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. పనులకు అడ్డంకులు ఎదురవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ప్రయాణాలను వాయిదా వేయండి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి.

కుంభం
 

అభీష్టం సిద్ధిస్తుంది. కార్యసాధనలో అందరి సహకారమూ లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కాలం ఆనందదాయకంగా సాగుతుంది.

మీనం 

స్థిర చిత్తంతో చేసే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. కుటుంబ వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. విందుకు హాజరవుతారు. కొత్త బాధ్యతలను చేపడతారు. అభీష్టం సిద్ధిస్తుంది.

Tags:    

Similar News