రాశిఫలం
23-12-2024 (సోమవారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత రుతువు, కృష్ణ పక్షం
తిధి : అష్టమి సాయంత్రం గం.5.07 ని.ల వరకు ఆ తర్వాత నవమి
నక్షత్రం: ఉత్తర ఉదయం గం.9.09 ని.ల వరకు ఆ తర్వాత హస్త
అమృతఘడియలు: అర్ధరాత్రి దాటిన తర్వాత తె.వా. గం. 5.30 ని.ల నుంచి గం.7.19 ని.ల వరకు
వర్జ్యం: సాయంత్రం గం.6.39 ని.ల నుంచి గం.8.28 ని.ల వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం.12.38 ని.ల నుంచి గం.1.22 ని.ల వరకు మల్లీ మధ్యాహ్నం గం.2.50 ని.ల నుంచి గం.3.35 ని.ల వరకు
రాహుకాలం : ఉదయం గం. 7.32 ని.ల నుంచి గం.9.24 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం. 6.41 ని.లకు
సూర్యాస్తమయం :సా. గం. 5.46 ని.లకు
మేషం :
అడ్డంకులను తేలిగ్గా దాటేస్తారు. వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. అవసరమైన మేర డబ్బు సమకూరుతుంది. కొత్త వస్తువులను కొంటారు. బంధువుల అండ ఉంటుంది. వివాదం పరిష్కారం అవుతుంది.
వృషభం :
అభీష్ట సాధనలో ఆటంకాలు దుఃఖాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన రీతిలో సాగవు. ఆభరణాలను జాగ్రత్తగా దాచండి. వాత సంబంధ సమస్య ఉంటుంది. బాధ్యతల నిర్వహణలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
మిథునం :
ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యవహార నష్టం గోచరిస్తోంది. బుద్ధి నిలకడగా ఉండదు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. అవమానాలకు ఆస్కారముంది. స్నేహితుల తోడ్పాటూ లభించదు. ధన సమస్య ఉంటుంది.
కర్కాటకం:
ఆదాయ వనరులు పెరుగుతాయి. పనులు కూడా ఆశించినట్లే పూర్తవుతాయి. ఇతరులపై ఆధారపడకుండా స్వయంకృషితోనూ కార్యాలు సాధిస్తారు. ప్రయాణం గోచరిస్తోంది. తోటి ఉద్యోగులతో సఖ్యత ఏర్పడుతుంది.
సింహం :
పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వుంటుంది. ఆర్థిక చికాకులు వస్తాయి. మనసులోని మాటను బయటికి చెప్పలేక పోతారు. విలువైన వస్తువులను పోగొట్టుకునే సూచన ఉంది. కుటుంబ సభ్యుల తీరు బాధిస్తుంది.
కన్య :
అన్ని ప్రయత్నాలూ ఫలిస్తాయి. విధినిర్వహణలో బాధ్యతగా మెలగుతారు. ఉన్నతాధికారుల ఆశీస్సులు లభిస్తాయి. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. జన్మస్థలానికి సంబంధించి ఆలోచనలు వస్తాయి. విందుకు వెళతారు.
తుల :
కార్యనిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాల్లో జోక్యం వద్దు. మిత్రులు మీతో విభేదిస్తారు. దూర ప్రయాణం ఉంది. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కంటి సమస్యను నిర్లక్ష్యం చేయకండి.
వృశ్చికం :
అన్ని పనులూ లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంతాన సంబంధ శుభవర్తమానం అందుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మనశ్శాంతిని పొందుతారు.
ధనుస్సు :
అన్నింటా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తిపర నైపుణ్యం పెంచుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంపై శ్రద్ధ పెడతారు.
మకరం :
వ్యవహారాలు సజావుగా సాగవు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. భవిష్యత్తు గురించిన చింత ఏర్పడుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం ఉంది.. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. తగాదాలు వద్దు. కడుపులో ఇబ్బంది ఉంటుంది.
కుంభం :
అనుకోని ఇబ్బంది వస్తుంది. ధైర్యం కోల్పోకండి. పోటీలకు దూరంగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. మూఢనమ్మకాలను వదిలి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి.
మీనం :
భాగస్వామ్య వ్యవహరాలు లాభిస్తాయి. కుటుంబ వ్యవహారంలో జీవిత భాగస్వామి సహకారం చాలా అవసరం. ఆర్థిక లావాదేవీలు తృప్తిగా సాగుతాయి. నిజాయితీకి తగ్గ గుర్తింపు లభిస్తుంది. విందుకు వెళతారు.
శుభమస్తు