Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (12/12/2024)

Daily Horoscope Today In Telugu, December 12, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

Update: 2024-12-11 20:39 GMT

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (12/12/2024)

Daily Horoscope Today In Telugu, December 12, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.


మేషం (Aries)

అభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగాభివృద్ధికి చేసే ప్రయత్నం అనుకూలిస్తుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. ఉన్నత విద్యకు చేసే యత్నాలు ఫలిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

వృషభం (Taurus)

ఇతరుల అభివృద్ధి అసూయను కలిగిస్తుంది. చెడు ఆలోచనలను అదుపు చేసుకోండి. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. వృథా ఖర్చులుంటాయి. మనశ్శాంతి లోపిస్తుంది.

మిథునం (Gemini)

రోజు ఆనందంగా సాగుతుంది. ప్రతి కార్యం సఫలమవుతుంది. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. విందుకు హాజరవుతారు. బాల్య స్నేహితులను కలుస్తారు. ఆరోగ్యం బావుంటుంది. శుభ కార్య నిర్వహణపై చర్చిస్తారు.

కర్కాటకం (Cancer)

వృత్తి పరమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఉద్యోగంలో వృద్ధి గోచరిస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. మిత్రులు సహకరిస్తారు. అధికారుల ప్రశంసలను పొందుతారు. పోటీల్లో విజయం సాధిస్తారు. శత్రువులను గెలుస్తారు.

సింహం (Leo)

వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. అశాంతి పెరుగుతుంది. సంతానం తీరు కలవర పెడుతుంది. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. భవిష్యత్తు ప్రణాళికలను రూపొందిస్తారు. దైవచింతన పెరుగుతుంది.

కన్య (Virgo)

అనుకున్న రీతిలో పనులు సాగవు. కొన్ని పనులను అయిష్టంగా చేయాల్సి వస్తుంది. వేళకు భోజనముండదు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. తగాదాలకు దిగకండి. పోటీల్లో పాల్గొనకండి. కీళ్ల సమస్య ఉంటుంది.

తుల (Libra)

కొత్త విషయాలను గ్రహిస్తారు. ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ఇతరులతో బంధాలు బలపడతాయి. నిజాయితీకి తగ్గ ఫలితాన్ని పొందుతారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి.

వృశ్చికం (Scorpio)

వ్యవహారాలన్నీ సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. బలహీనతను అధిగమిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు.

ధనుస్సు (Sagittarius)

పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. చింత కలుగుతుంది. సంతానం తీరు అసహనానికి కారణం అవుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అభీష్టం నెరవేరదు. దురాలోచనలు వస్తాయి. విలువైన వస్తువులు జాగ్రత్త.

మకరం (Capricorn)

బుద్ధి నిలకడగా ఉండదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బుకి ఇబ్బంది పడతారు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నమ్మిన వారి చేత మోసపోయే సూచన ఉంది. విద్యారంగంలోని వారు జాగ్రత్త.

కుంభం (Aquarius)

చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. నాయకత్వ లక్షణానికి ప్రశంసలు లభిస్తాయి. సోదరుల సహకారం లభిస్తుంది. కీలక సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఆత్మీయులతో విందుకు హాజరవుతారు.

మీనం (Pisces)

బ్యాంకు వ్యవహారాలు చికాకు పెడతాయి. ఖర్చు పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వల్ల ఇబ్బంది పడతారు. వేళకు భోజనం ఉండదు. పనులకూ ఆటంకాలు పెరుగుతాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి.

ALSO READ: Telugu Panchangam Today: ఈరోజు పంచాంగం, తిథి, నక్షత్రం, డిసెంబర్ 12, 2024

Tags:    

Similar News