Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (6/1/2025)
Daily Horoscope Today In Telugu, January 6, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.
Daily Horoscope Today In Telugu, January 6, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.
మేషం
ఖరీదైన వస్తువులను కొంటారు. అనూహ్య ఖర్చులూ పెరుగుతాయి. పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. సాటివారి ఎదుగుదలకు అసూయ చెందకండి. మిత్రవిరోధం గోచరిస్తోంది. బాధ్యతల నుంచి తప్పుకుంటారు.
వృషభం
ఆనందంగా గడుపుతారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. సేవాభావం పెరుగుతుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. ఆత్మీయులతో విందుకు హాజరవుతారు. కొత్త సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం నిలకడగా వుంటుంది.
మిథునం
ఉన్నత పదవిలోని వారి అండదండలు లభిస్తాయి. వృత్తిపరమైన ఎదుగుదల ఉంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ప్రత్యర్థులపై జయం సాధిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది.
కర్కాటకం
ధర్మమార్గంలో పయనిస్తేనే సత్ఫలితాలను పొందగలుగుతారు. నిజాయితీకి గుర్తింపు ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం చూపుతారు. ఖర్చులను బాగా తగ్గించాలి. శత్రుపీడ ఉంటుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది.
సింహం
అనుకున్న రీతిలో పనులు సాగవు. సౌకర్యాలూ సమకూరవు. కోపాన్ని అదుపు చేసుకోవాలి. వేళకు భోజనం ఉండదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చెప్పుడు మాటలను గుడ్డిగా విశ్వసించకండి. జీర్ణ సమస్యలుంటాయి.
కన్య
వ్యాపార లావాదేవీలు ఆశించిన లబ్దినిస్తాయి. కొత్త విషయాలను గ్రహిస్తారు. ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. బంధువులు, మిత్రులను కలుస్తారు. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది.
తుల
పనుల్లో విజయం సాధిస్తారు. ధనలాభం ఉంది. కీలక వ్యవహారంలో మిత్రుల తోడ్పాటుతో శుభ ఫలితం పొందుతారు. కీర్తి పెరుగుతుంది అపార్థం తొలగుతుంది. ప్రత్యర్థులను గెలుస్తారు. ఆరోగ్యం బావుంటుంది.
వృశ్చికం
ఆటంకాలు ఎదురైనా మనోధైర్యం కోల్పోవద్దు. నెమ్మదిగానే అయినా పనులు పూర్తవుతాయి. అనవసర వ్యవహారాల్లో జోక్యం వల్ల ఇబ్బందులొస్తాయి. అభీష్టం నెరవేరక పోవచ్చు. వృథా ఖర్చులను బాగా తగ్గ్గించాలి.
ధనుస్సు
బుద్ధి నిలకడగా ఉండదు. కార్యాలు ఆశించిన రీతిలో సాగవు. ఆలోచన విధానం మారుతుంది. వృథా ఖర్చులు ఆందోళనను పెంచుతాయి. రహస్య జీవితం బహిర్గతమయ్యే సూచన ఉంది. స్నేహితులు సహకరించరు.
మకరం
వ్యవహారాల్లో విశేష లాభాన్ని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. విందుకు హాజరవుతారు. ఉత్తర, ప్రత్యుత్తరాలు సంతృప్తిని కలిగిస్తాయి.
కుంభం
మనసులోని మాటను స్పష్టంగా చెప్పలేక ఇబ్బంది పడతారు. నిజాయితీగా వ్యవహరించండి. ముందుచూపు లేని నిర్ణయాల వల్ల సత్ఫలితాలను పొందలేరు. అనవసర జోక్యాలను మానుకోండి. వేళకు భోజనం ఉండదు.
మీనం
అన్నీ అనుకున్నట్లే సాగుతాయి. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. తెలివితేటలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. బాల్యస్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. విందుకు హాజరవుతారు. ఆరోగ్యం బావుంటుంది.