కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, పుష్య మాసం, దక్షినాయనం, హేమంత రుతువు, శుక్ల పక్షం
తిధి : ద్వాదశి ఉదయం గం.8.21 ని.ల వరకు తర్వాత త్రయోదశి రేపు ఉదయం గం.6.33 ని.ల వరకు
నక్షత్రం: రోహిణి మధ్యాహ్నం గం.12.29 ని.ల వరకు ఆ తర్వాత మృగశిర
అమృతఘడియలు: ఉదయం గం.9.27 ని.ల నుంచి గం.10.58 ని.ల వరకు
వర్జ్యం: సాయంత్రం గం.5.50 ని.ల నుంచి రాత్రి గం.7.22 ని.ల వరకు
దుర్ముహూర్తం : ఉదయం గం.6.50 ని.ల నుంచి గం.8.29 ని.ల వరకు
రాహుకాలం : ఉదయం గం. 9.12 ని.ల నుంచి గం.11.04 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం. 6.50 ని.లకు
సూర్యాస్తమయం :సా. గం.6.06 ని.లకు
మేషం :
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది. విడాకులకు, రెండో పెళ్లి ప్రయత్నానికి ఇవాళ యోగదాయకం కాదు. అకారణ విరోధం గోచరిస్తోంది. ఇతరులత వ్యవహారాల్లో జాగ్రత్త.
వృషభం :
అన్ని రంగాల వారికీ అనుకూల ఫలితాలుంటాయి. మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు లభిస్తాయి. అవసరమైన మేర డబ్బు అందుతుంది. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం బావుంటుంది. అదృష్టం వరిస్తుంది.
మిథునం :
ఎవరికీ హామీలు ఇవ్వకండి. ఆర్థిక క్రమశిక్షణ లేకుంటే బాగా ఇబ్బంది పడతారు. తొందరపాటు నిర్ణయాల వల్ల పరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఒంటరిగా గడిపే సూచన ఉంది. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా ఉండకండి.
కర్కాటకం:
వ్యవహారాలన్నీ అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా లాభపడతారు. ప్రత్యర్థులను జయిస్తారు. విందుకు హాజరవుతారు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. సంతాన సంబంధ విషయాలు ఆనందాన్నిస్తాయి.
సింహం :
అభీష్టం నెరవేరుతుంది. స్థిర నిర్ణయాల వల్ల ప్రతి కార్యమూ విజయవంతం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. కొత్త బాధ్యతలను స్వీకరించే సూచన ఉంది. బంధువులను కలుస్తారు. ప్రశాంతత లభిస్తుంది.
కన్య :
పెద్దలను కలుస్తారు. భవిష్యత్తు చర్యల గురించి చర్చిస్తారు. కీలక నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించండి. వేధిస్తోన్న ఓ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు. త్వరగా అలసిపోతారు. ఆరోగ్యం జాగ్రత్త.
తుల :
కార్యనిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. అనుకున్నట్లుగా సౌకర్యాలు సమకూరవు. తగాదాలకు ఆస్కారం ఉంది. పెద్దల కోపానికి గురవుతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
వృశ్చికం :
అన్ని పనులూ సవ్యంగా జరుగుతాయి. అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది. ప్రయాణం లాభిస్తుంది. కొత్త విషయాలను గ్రహిస్తారు. నిజాయితీకి తగ్గ గుర్తింపు లభిస్తుంది. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి.
ధనుస్సు :
శుభ ఫలితాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులను కొంటారు. బంధువులను కలుస్తారు. శుభకార్యాల గురించిన చర్చ జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అపార్థాలు తొలగుతాయి.
మకరం :
అనుమానాలను వదిలేయండి. చిత్తశుద్ధితో చేసే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఆలోచనలను అదుపులో ఉంచండి. బద్ధకించకండి. సంతానం తీరు కలవర పరుస్తుంది. అభీష్టం నెరవేరదు. వృథా ఖర్చులు తగ్గించాలి.
కుంభం :
పనులు సవ్యంగా సాగవు. డబ్బుకి సంబంధించిన చికాకులూ తలెత్తుతాయి. మానసిక ఒత్తిడికి గురవుతారు. రహస్యాలను బయటపెట్టకండి. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. బుద్ధి నిలకడగా ఉండదు. ప్రయాణంలో జాగ్రత్త.
మీనం :
కీలక సమాచారం ఆనంద పరుస్తుంది. వ్యవహారాల్లో విశేష లాభాన్ని పొందుతారు. మిత్రులు తోడుంటారు. సోదరుల సమస్యను పరిష్కరిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మీయులతో గడపడం ఉత్తేజాన్నిస్తుంది.
శుభమస్తు