Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (8/1/2025)
Daily Horoscope Today In Telugu, January 8, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.
Daily Horoscope Today In Telugu, January 8, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.
మేషం
రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. వ్యవహారాలన్నీ అనుకూలంగా సాగుతాయి. ఇంటికి అవసరమైన వస్తువులను కొంటారు. మీ వ్యక్తిత్వం, నడవడికలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. వాహనయోగం ఉంది.
వృషభం
వ్యవహారాలు ఆశించిన స్థాయిలో జరగవు. ఎంత కష్టపడ్డా లక్ష్యాన్ని చేరుకోలేక పోతారు. అనూహ్యమైన ఖర్చు కూడా వేధిస్తుంది. నోటి దురుసు తనం స్నేహితులను దూరం చేసే వీలుంది. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు.
మిథునం
కొత్త బంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో శుభకార్యాచరణ ప్రణాళికలు వేస్తారు. బంధువులతో విందుకు హాజరవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. మనశ్శాంతిని పొందుతారు.
కర్కాటకం
ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం లభిస్తుంది. వృత్తిపరమైన వ్యవహారాల్లో ప్రశంసలను పొందుతారు. అన్ని రంగాల్లోని వారికీ అనుకూల ఫలితాలు ఉంటాయి. అభీష్టం నెరవేరుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.
సింహం
దూర ప్రయాణం ఉంది. సంతానం తీరుతో విభేదిస్తారు. మనసు అలజడిగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆధ్యాత్మిక విషయాలు ఊరటనిస్తాయి. అజాగ్రత్త వల్ల ఉద్యోగులు చివాట్లు తింటారు. అధైర్య పడకండి.
కన్య
వారసత్వపు ఆస్తి వ్యవహారాలను వాయిదా వేసుకోండి. అనుకున్న రీతిలో పనులు పూర్తి కావు. ఓపిక అవసరం. పోటీలకు దూరంగా ఉండండి. శత్రుపీడ పెరుగుతుంది. చెప్పుడు మాటలను నమ్మకండి. ఆరోగ్యం జాగ్రత్త.
తుల
భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. బంధువులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. బంధాలు బలపడతాయి. ప్రయాణం సంతోషాన్నిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వృశ్చికం
వ్యవహారాలన్నింటా శుభ ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తిగా ఉంటాయి. బలహీనతలను జయించండి. అపార్థాలు తొలగుతాయి. బంధువుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.
ధనుస్సు
సంతానం తీరు చికాకు పెడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ఉండవు. చెడు ఆలోచనలను అదుపు చేయాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆందోళన అధికం అవుతుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది.
మకరం
బుద్ధి నిలకడగా ఉండదు. ఆర్థిక లావాదేవీలు అనుకున్న రీతిలో సాగవు. పనులు బెడిసికొట్టడం కలవర పెడుతుంది. తల్లి తరఫు బంధువుల సమాచారం అందుతుంది. స్థిరాస్తి వ్యవహారాలను వాయిదా వేయండి.
కుంభం
కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాల్లో విశేష లాభాన్ని పొందుతారు. నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది. సాహస నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల అండ ఉంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.
మీనం
ఏ పనీ సజావుగా జరగదు. అడుగడుగునా ఆటంకాలు వస్తాయి. ఇతరుల కారణంగా ఇబ్బంది పడతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశించినట్లుగా సాగవు. కుటుంబ చికాకులను పరిష్కరించాల్సి వస్తుంది. మనశ్శాంతి ఉండదు.