Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (13/1/2025)

Daily Horoscope Today In Telugu, January 13, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.

Update: 2025-01-12 19:53 GMT

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (13/1/2025)

Daily Horoscope Today In Telugu, January 13, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, పుష్య మాసం, దక్షిణాయనం, హేమంత రుతువు, శుక్ల పక్షం

తిధి: పౌర్ణమి అర్ధరాత్రి దాటాక తె.వా.గం.3.56 ని.ల వరకు ఆ తర్వాత కృష్ణ పాడ్యమి

నక్షత్రం: ఆరుద్ర ఉదయం గం.10.38 ని.ల వరకు ఆ తర్వాత పునర్వసు

అమృతఘడియలు: లేవు

వర్జ్యం: రాత్రి గం.10.27 ని.ల నుంచి అర్ధరాత్రి గం.12.02 ని.ల వరకు

దుర్ముహూర్తం: మధ్యాహ్నం గం.12.51 ని.ల నుంచి గం.1.37 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.07 ని.ల నుంచి గం.3.52 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం 7.32 ని.ల నుంచి గం.9.15 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.51 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం.6.07 ని.లకు

మేషం 

వ్యవహారాలన్నీ సఫలం అవుతాయి. ధనలాభముంది. సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు. మిత్రులు తోడ్పడతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోదరుల సమస్యను పరిష్కరిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది.

వృషభం 

కుటుంబ సభ్యుల వ్యవహారాలను పట్టించుకుంటారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. ముందుచూపు లేకుంటే నిందల పాలవుతారు. వేళకు భోజనముండదు. అకారణ విరోధాలకు ఆస్కారముంది. కంటి సమస్య వస్తుంది.

మిథునం 

అన్నీ అనుకూల సంఘటనలే ఎదురవుతాయి. మిత్రుల వల్ల లబ్దిని పొందుతారు. అవసరానికి తగ్గ డబ్బు చేతికి అందుతుంది. అంతులేని ఆనందాన్ని పొందుతారు. కుటుంబసౌఖ్యం లభిస్తుంది. బాల్య మిత్రులను కలుస్తారు.

కర్కాటకం

వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. ప్రతి పనికీ అడ్డంకులు వస్తాయి. తొందరపాటు చర్య వల్ల పరిహారం చెల్లించే పరిస్థితి వస్తుంది. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. వృథా ఖర్చు పెరుగుతుంది. మనశ్శాంతి ఉండదు.

సింహం 

శుభప్రదంగా ఉంటుంది. అన్ని పనులూ విజయవంతం అవుతాయి. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. రుణ సంబంధ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. పెద్దలను కలిసి ఆశీస్సులను పొందుతారు. విందులో పాల్గొంటారు.

కన్య 

అభీష్టం నెరవేరుతుంది. ఆర్థికంగా బలపడతారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. వృత్తిపరంగా ఎదుగుదల ఉంటుంది. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

తుల 

చేపట్టిన ప్రతి పనికీ అడ్డంకులు ఎదురవుతాయి. బద్ధకం వీడి కష్టపడితే వ్యవహార జయం ఉంటుంది. సంతానం తీరు చికాకు పెడుతుంది. ఖర్చు విపరీతంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. త్వరగా అలసిపోతారు.

వృశ్చికం 

వారసత్వపు ఆస్తి వ్యవహారాలు అనుకూలించవు. అనవసర పోటీల్లో పాల్గొనకండి. పొరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. వేళకు భోజనముండదు. చెప్పుడు మాటల నమ్మకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

ధనుస్సు 

వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యర్థులను చిత్తు చేస్తారు. విందులో పాల్గొంటారు. బంధాలు బలపడతాయి. ప్రయాణం లాభిస్తుంది.

మకరం 

పనుల్లో శుభ ఫలితాలుంటాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. బంధువులను కలుస్తారు. ఆర్థికంగా లాభపడతారు. విందుకు హాజరవుతారు. అపార్థాలు తొలగిపోతాయి. అడ్డంకులను దాటేస్తారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.

కుంభం 

పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. కీలక నిర్ణయాల్లో సొంత తెలివితేటలు వద్దు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త. సంతాన సంబంధ వ్యవహారాలు బాధిస్తాయి. నిరాశ చెందకండి. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన శాంతినిస్తుంది.

మీనం 

బద్ధకాన్ని వీడి పనిచేస్తే అడ్డంకులను దాటేస్తారు. బుద్ధి నిలకడగా ఉండదు. డబ్బుకి కాస్త ఇబ్బంది ఉంటుంది. ఆత్మీయులతోనే విరోధం ఏర్పడుతుంది. నమ్మినవారే మోసగిస్తారు. వాహన సంబంధ సమస్య తలెత్తుతుంది.

Tags:    

Similar News