Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (14/1/2025)

Daily Horoscope Today In Telugu, January 14, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

Update: 2025-01-13 20:01 GMT

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (14/1/2025)

Daily Horoscope Today In Telugu, January 14, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

మేషం 

పనులు అనుకున్నట్లుగా సాగవు. నిరాశ చెందకండి. బంధాలు దృఢమయ్యేలా చూసుకోండి. రహస్యాలను దాచండి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి.

వృషభం 

అన్నివైపులా శుభ పరిణామాలే ఉంటాయి. వ్యవహారాల్లో విశేష లాభం పొందుతారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ధైర్యం పెరుగుతుంది.

మిథునం 

అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. మనసులోని భావాన్ని స్పష్టంగా చెప్పడం వల్ల సమస్య తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టండి. అవసరానికి సరిపడినంత డబ్బు అందుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

కర్కాటకం

ఉత్సాహంగా గడుపుతారు. బంధుమిత్రులను కలుస్తారు. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. సామాజిక అంశాలపై అవగాహన పెరుగుతుంది. మీ వ్యక్తిత్వానికి విశేష గుర్తింపు లభిస్తుంది. మనస్థైర్యం పెరుగుతుంది.

సింహం

దానధర్మాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీ అవసరాలకు ఇబ్బంది పడతారు. తొందరపాటు నిర్ణయం వల్ల నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. అనవసర జోక్యాలు వద్దు. బద్ధకాన్ని వదిలిపెట్టాలి. పోటీల్లో పాల్గొనకండి.

కన్య 

అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి. పెద్దల అభిమానాన్ని పొందుతారు. మిత్రులు సహకరిస్తారు. విందులో పాల్గొంటారు. శుభకార్యం గురించి కుటుంబంతో చర్చిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది.

తుల 

అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ఇష్టమైన కార్యం సఫలం అవుతుంది. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. పెద్దల ఆదరాభిమానాలు లభిస్తాయి.

వృశ్చికం 

బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశించినట్లు ఉండవు. సంతానం తీరును ఓకంట కనిపెట్టుకుని ఉండాలి. శాంతంగా ఉండండి. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులను పొందుతారు.

ధనుస్సు 

వ్యవహారాలు ఆశించినట్లుగా సాగవు. డబ్బు సమస్య ఉంటుంది. శత్రుపీడ పెరుగుతుంది. ఇష్టం లేని పనిని చేయాల్సి వస్తుంది. పోటీలకు దూరంగా ఉండండి. అనవసర జోక్యాలు వద్దు. జీర్ణ సంబంధసమస్య ఉంటుంది.

మకరం 

రోజు తృప్తిగా సాగుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. విందులో పాల్గొంటారు. కొత్త విషయాలు తెలుస్తాయి. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. ప్రయాణం లాభిస్తుంది.

కుంభం 

ప్రతి కార్యం శుభప్రదంగా సాగుతుంది. ధన లాభం ఉంది. బంధు, మిత్రుల సహకారం లభిస్తుంది. కొత్త వస్తువులను కొంటారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అపార్థాలు తొలగిపోతాయి. విందులో పాల్గొంటారు.

మీనం 

అభీష్టం నెరవేరేందుకు బాగా శ్రమించాల్సి వుంటుంది. కీలక నిర్ణయాల్లో సొంత తెలివితేటలు వద్దు. ప్రేమ వ్యవహారాలు ఫలించవు. చెడు ఆలోచనలను నియంత్రించాలి. గొడవలు వద్దు. వృథా ఖర్చులు తగ్గించుకోండి.

Tags:    

Similar News