Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (5/12/2024)
Telugu Horoscope Today, December 5, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.
Telugu Horoscope Today, December 5, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.
మేషం
అన్నింటా అనుకూల ఫలితాలుంటాయి. ఉన్నత పదవిలోని వారు సహకరిస్తారు. తండ్రి సామాజిక స్థితిగతులు మెరుగవుతాయి. ఇతరులతో విరోధంలో మీదే విజయం. అభీష్టం నెరవేరుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.
వృషభం
కార్యసాధనకు విపరీతంగా కష్ట పడాల్సి వుంటుంది. త్వరగా అలసిపోతారు. ప్రయాణం ద్వారా అనుకోని ఖర్చు వస్తుంది. శత్రుపీడ పెరుగుతుంది. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. దైవ క్షేత్రాన్ని దర్శిస్తారు.
మిథునం
సమయానికి పనులు పూర్తి కావు. ఆర్థిక వ్యవహారాలూ తృప్తినివ్వవు. అసహనం పెరుగుతుంది. ప్రత్యర్థులూ విసిగిస్తారు. చెడుదారి వైపు వెళ్లకండి. ఉద్రేకాన్ని అదుపు చేసుకోండి. జీర్ణ సంబంధ సమస్య ఉంటుంది.
కర్కాటకం
ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. బంధాలు బలపడతాయి. ప్రయాణం ఆనందాన్నిస్తుంది. నిజాయితీకి తగ్గ ఫలితం లభిస్తుంది. అంతర్గత ఆనందం పెరుగుతుంది. విందుకు హాజరవుతారు. కీర్తి వృద్ధి చెందుతుంది.
సింహం
వ్యవహార జయం ఉంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కొత్త వస్తువులను కొంటారు. ప్రత్యర్థులపై విజయంతో మానసిక దిగులు దూరమవుతుంది. బంధువులు సహకరిస్తారు. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.
కన్య
ఆటంకాలు ఎదురైనా కార్యాలు సఫలం అవుతాయి. అభీష్టం నెరవేరక పోవడం నిరాశను కలిగిస్తుంది. వృథా ఖర్చులుంటాయి. సంతాన సంబంధ వ్యవహారంపై దృష్టి పెడతారు. విలువైన వస్తువు, డాక్యుమెంట్లు జాగ్రత్త.
తుల
బుద్ధి నిలకడగా ఉండదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. మనశ్శాంతి దూరమవుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
వృశ్చికం
అన్ని పనుల్లోనూ శుభఫలితాలే ఉంటాయి. కీలక సమాచారం ఆనందాన్ని పెంచుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆంతరంగిక సన్నిహితుల కలయిక కొత్త ఉత్సాహమిస్తుంది. అనూహ్య ప్రయాణం గోచరిస్తోంది.
ధనుస్సు
పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. తొందరపాటు వ్యాఖ్యల ప్రభావం కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు తృప్తినివ్వవు. అకారణ విరోధం గోచరిస్తోంది. విడాకులు, రెండో పెళ్లి ప్రయత్నాల్లో జాప్యం ఏర్పడుతుంది.
మకరం
ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వ్యవహారాలు తృప్తినిస్తాయి. గౌరవం పెరుగుతుంది. ధనలాభం ఉంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. జీవితంలో ఎదిగేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదృష్టం వరిస్తుంది.
కుంభం
వ్యవహార నష్టం గోచరిస్తోంది. బద్ధకం వల్ల ఉద్యోగంలో ఇబ్బందులు వస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. వేళకు భోజనం ఉండదు. నిద్రలేమి వేధిస్తుంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు.
మీనం
రోజంతా శుభప్రదంగా సాగుతుంది. ఇష్టమైన వారిని కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన సంబంధ విషయాలు ఆనంద పరుస్తాయి.