Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (3/12/2024)
Telugu Horoscope Today, December 3, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.
Telugu Horoscope Today, December 3, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.
మేషం
ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారుల ఆగ్రహానికి గురయ్యే సూచన ఉంది. సంతానం తీరు చికాకు పరుస్తుంది. దూర ప్రాంత ప్రయాణం గోచరిస్తోంది. ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
వృషభం
కార్యసాధనలో అడ్డంకులు వస్తాయి. కోపాన్ని అదుపు చేసుకోవాలి. బాధ్యతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి. దురాలోచనలను అదుపు చేసుకోండి. అనవసర తగాదాలకు ఆస్కారముంది. పోటీల్లో పాల్గొనకండి.
మిథునం
ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆర్థిక లబ్ది చేకూరుతుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. బంధువులను కలుస్తారు. విందుకు హాజరవుతారు. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు.
కర్కాటకం
వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. అదృష్టం మీ వెన్నంటి వుంటుంది. వ్యవహారాల్లో శుభ ఫలితాలు లభిస్తాయి. కీర్తి పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. నూతన వస్తు ప్రాప్తి ఉంది.
సింహం
చేస్తున్న పనిలో చిక్కులొస్తాయి. బద్ధకం వల్ల సమస్యలు పెరుగుతాయి. అభీష్టం నెరవేరే సూచన లేదు. సంతాన సంబంధ వ్యవహారాల్లో శ్రద్ధ వహించాలి. కీలక వ్యవహారాల్లో మిత్రుల సూచనలు పాటించడం మేలు.
కన్య
ప్రతి పనికీ అడ్డంకి ఎదురవుతుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టాలి. మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది. వాహన సంబంధ చికాకులు ఉంటాయి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
తుల
వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో లాభం పొందుతారు. ఆత్వవిశ్వాసం పెరుగుతుంది. మిత్రులు తోడుంటారు. ఇరుగు పొరుగుతో సంబంధాలు బలపడతాయి. కీలక సమాచారం ఆనందపరుస్తుంది.
వృశ్చికం
వ్యవహార నష్టం గోచరిస్తోంది. బ్యాంకు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండండి. చెప్పుడు మాటలను నమ్మకండి. రెండో పెళ్లి ప్రయత్నం వాయిదా వేయండి. అకారణ విరోధాలు ఏర్పడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
ధనుస్సు
రోజంతా ఉత్సాహభరింగా సాగుతుంది. ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు ఆనందాన్ని పెంచుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విందుకు హాజరవుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
మకరం
ఏ పనీ సజావుగా సాగదు. చికాకు పెరుగుతుంది. ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసర ప్రయాణాలు మానుకోండి. అనూహ్య ఖర్చులు ఆందోళనను కలిగిస్తాయి.
కుంభం
అన్ని వ్యవహారాల్లో శుభ ఫలితాలు లభిస్తాయి. ఆత్మీయులతో విందుకు హాజరవుతారు. ఇంటికి అవసరమైన వస్తువులను కొంటారు. రుణ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి.
మీనం
చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. పెద్దల ఆదరాభిమానాలను పొందుతారు. ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగులకు మేలిమి ఫలితాలుంటాయి. ప్రత్యర్థులను ఓడిస్తారు.