Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (9/12/2024)

Telugu Horoscope Today, December 9, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.

Update: 2024-12-08 20:30 GMT

Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (9/12/2024)

Telugu Horoscope Today, December 9, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.


మేషం

పనుల్లో జాప్యం ఉంటుంది. అనవసర ప్రయాణం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర జోక్యం వల్ల బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. వేళకు భోజనముండదు.

వృషభం

అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. ఇతరుల నుంచి తగిన సహకారం లభిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. విందులకు హాజరవుతారు. అభీష్టం నెరవేరుతుంది.

మిథునం

వృత్తి నైపుణ్యానికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. జీవనోపాధి మార్గాలు పెరుగుతాయి. ప్రభుత్వం నుంచి గౌరవం లభిస్తుంది. చక్కటి అవకాశాలు కలిసివస్తాయి. ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

కర్కాటకం

పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వస్తుంది. ఉన్నత విద్యకు చేసే ప్రయత్నాలు సఫలం కావు. తండ్రితో సఖ్యత చెడుతుంది. అశాంతి పెరుగుతుంది. వృథా ఖర్చులు తగ్గించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. తగాదాలు వద్దు.

సింహం 

వ్యవహారాలు ఆశించిన స్థాయిలో సాగవు. పోటీపడి పనిచేసినా తగిన ఫలితం ఉండదు. ఆకస్మిక ధననష్టం సూచిస్తోంది. కీళ్ల సమస్య వేధిస్తుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. చెప్పుడు మాటలను విశ్వసించకండి.

కన్య 

వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఇంట్లో సందడి నెలకొంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత వృద్ధి చెందుతుంది. ఇతర బంధాలూ బలపడతాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రశాంతతను పొందుతారు.

తుల 

స్వస్థాన ప్రాప్తి ఉంది. బంధువుల సహకారం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త వస్తువులు కొంటారు. బలహీనతలను జయిస్తారు. అపార్థాలు తొలగిపోతాయి. కష్టాలు దూరమవుతాయి.

వృశ్చికం 

ఇష్టకార్యం భంగమవుతుంది. మనో వ్యథ పెరుగుతుంది. అనవసర తగాదాలకు ఆస్కారముంది. కీలక నిర్ణయాలకు ముందు ఆత్మీయులను సంప్రదించండి. వాత సమస్యలుంటాయి. నిరాశను వీడి కృషి చేయండి.

ధనుస్సు 

ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. వ్యవహారాలు సఫలం కాక అశాంతి పెరుగుతుంది. ప్రతి పనికీ అడ్డంకులు వస్తాయి. రహస్య జీవితంపై రచ్చ జరుగుతుంది. గొడవల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది..

మకరం 

స్వయంకృషికి తగ్గ ఫలితం వస్తుంది. అయినవారంతా సహకరిస్తారు. ఇరుగు పొరుగుతో సఖ్యత పెరుగుతుంది. కీలక సమాచారం తృప్తినిస్తుంది. దాయాదుల వ్యవహారాలు చక్కబడతాయి. ఆత్మీయులను కలుస్తారు.

కుంభం 

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నిందలు భరించాల్సి వస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వల్ల గొడవలొస్తాయి. వేళకు భోజనం ఉండదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కుటుంబంలో చికాకులకు ఆస్కారముంది.

మీనం 

ఆకాంక్ష నెరవేరుతుంది. ధన సంబంధ లావాదేవీలు లాభిస్తాయి. తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ వాతావరణం సంతృప్తినిస్తుంది. చిన్నప్పటి సంగతులు గుర్తుకొస్తాయి.

Tags:    

Similar News