Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (డిసెంబర్ 1 - 7)
Weekly Horoscope in Telugu, 2024 December 1 to 7: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.
Weekly Horoscope in Telugu, 2024 December 1 to 7: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.
మేషం
సంకల్పం సిద్ధిస్తుంది. అన్ని వ్యవహారాలూ అనుకూలంగా సాగుతాయి. రుణ విముక్తి యత్నాలు కొలిక్కి వస్తాయి. శత్రువుల బెడద తగ్గుముఖం పడుతుంది. పెద్దల ఆశీస్సులను పొందుతారు. పురోభివృద్ధికి అవసరమైన అవకాశాలు అందివస్తాయి. సంతాన సంబంధ శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. బాధ్యతల నిర్వహణలో ప్రశంసలు అందుకుంటారు. ఎదుగుదలకు కొత్త పరిచయాలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పుణ్య క్షేత్రాన్ని దర్శిస్తారు. విదేశీ ప్రయాణ యత్నాలు అనుకూలిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది.
పరిహారం: గాయత్రీమాతను పూజించండి. కుంకుమ రంగు కలిసిన దుస్తులను ధరించండి.
వృషభం
స్థిర చిత్తంతో చేసే పనులు సఫలం అవుతాయి. ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. అభీష్టం నెరవేరుతుంది. బంధువులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. పోటీల్లో మీరే విజేతలుగా నిలుస్తారు. అధికారులు, కుటుంబ పెద్దల ఆదరాభిమానాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. చెడు ఆలోచనలను నియంత్రించాలి. ఓ దశలో అయిష్టమైన పనిని చేయాల్సి రావడం వేదనకు కారణమవుతుంది. ప్రమాదాలకు ఆస్కారముంది కాబట్టి, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి వృద్ధి చెందుతుంది.
పరిహారం: సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. లేత పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.
మిథునం
వ్యవహార జయం ఉంది. అంతర్గత ఆనందం పెరుగుతుంది. కొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి. సంతానం కోసం తపించే వారి ఆశలు తీరే సూచన ఉంది. విజ్ఞానాన్ని పెంచుకుంటారు. నిజాయితీకి గుర్తింపు లభిస్తుంది. కీలక సమయంలో జీవిత భాగస్వామి సూచన మేలు చేస్తుంది. ఆత్మీయులతో విందుకు హాజరవుతారు. శారీరక, మానసిక ఆనందాన్ని పొందుతారు. విదేశీ ప్రయాణ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు బాధ్యతగా మెలగాలి.. వారసత్వ ఆస్తి వ్యవహారాల్లో జాప్యం తప్పదు. ప్రయాణాల్లో జాగ్రత్త.
పరిహారం: ఆదిత్య హృదయ పఠనం మేలు చేస్తుంది. ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించండి.
కర్కాటకం
మేలిమి ఫలితాలను పొందుతారు. వ్యవహారాలన్నీ సఫలం అవుతాయి. ఆర్థిక స్థిరత్వానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. ప్రత్యర్థుల కుట్రలను భగ్నం చేస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత వృద్ధి చెందుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త బంధాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ప్రయాణం వినోదభరితంగా సాగుతుంది. ప్రయాణాల్లో, ముఖ్యంగా వాహనం నడిపేప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం: శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించండి. పసుపు వర్ణం కలిసిన దుస్తులను ధరించండి.
సింహం
లక్ష్యాన్ని సాధిస్తారు. అన్ని కీలక వ్యవహారాల్లోనూ శుభ ఫలితాలను పొందుతారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వస్తుప్రాప్తి ఉంది. మానసిక, శారీరక సౌఖ్యాలను పొందుతారు. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. వివాదాలు పరిష్కారమవుతాయి. అదృష్టం తోడుంటుంది. కుటుంబ వ్యవహారాలు సంతృప్తిగా ఉంటాయి. ఇతరులతో సత్సంబంధాలు ఉంటాయి. విజ్ఞానాభివృద్ధికి అనుకూలం. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా గడుపుతారు. మిత్రులతో విందుకు హాజరవుతారు. ప్రేమ వ్యవహారాలు ఫలించే సూచన లేదు.
పరిహారం : దుర్గామాతను పూజించండి. ఎర్రటి రంగు కలిసిన దుస్తులను ధరించండి.
కన్య
శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు. మిత్రులు సహకరిస్తారు. బలహీనతలను అధిగమిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కోర్టు వివాదాలు అనుకూలంగా సాగుతాయి. సహచరులతో ఏర్పడిన అపోహలు తొలగిపోతాయి. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆలోచన విధానం మారుతుంది. వృథా ఖర్చు తగ్గించండి. రక్త సంబంధీకుల గురించిన సమాచారం బాధిస్తుంది. సంతానం తీరు చికాకు పెడుతుంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం వల్ల ఇబ్బంది వస్తుంది. బద్ధకం వద్దు.
పరిహారం: నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. ముదురు నీలం రంగు కలిసిన దుస్తులను ధరించండి.
తుల
వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థికి స్థితిగతులు వృద్ధి చెందుతాయి. వస్త్రాభరణాలను కొంటారు. కీలక సందర్భంలో ధైర్యసాహసాలను ప్రదర్శిస్తారు. పెద్దల ఆశీస్సులను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. బోళాతనం మంచిది కాదు. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. కీలక సమాచారం ఆనందాన్నిస్తుంది. తల్లి ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల బంధువులతో విరోధం ఏర్పడుతుంది. స్థిరాస్తి రంగంలోని వారు జాగ్రత్తగా ఉండాలి. సంతాన సంబంధ చిక్కులుంటాయి. విలువైన వస్తువులు జాగ్రత్త.
పరిహారం: శ్రీ లక్ష్మీనృసింహ స్వామిని పూజించండి. సిందూరం రంగు కలిసిన దుస్తులను ధరించండి.
వృశ్చికం
ప్రయత్నపూర్వకంగా చేసే పనులు ఫలిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. కీలక కార్యాల్లో విజయం లభిస్తుంది. తోబుట్టువుల వ్యవహారాలను చక్కదిద్దుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రియతములను కలుస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. నైపుణ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. దైవ క్షేత్రాలను సందర్శిస్తారు. కమ్యూనికేషన్ల రంగంలోని వారికి యోగదాయకంగా ఉంటుంది. అకారణ వివాదాల్లో ఇరుక్కునే సూచన ఉంది. మీలోని భావాన్ని చెప్పలేక చిక్కుల్లో పడతారు. ఆస్తి విక్రయ వ్యవహారం వాయిదా వేయండి.
పరిహారం: శివుడిని పూజించండి. ఊదారంగు కలిసిన దుస్తులను ధరించండి.
ధనుస్సు
వ్యవహారాలు ఆశించినట్లే సాగుతాయి. ఆర్థికంగా సంతృప్తికరంగానే ఉన్నా, బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. తెలివితేటలకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఉన్నతస్థితికి చేరే యత్నాలు ఫలిస్తాయి. సోదర వర్గం తోడుంటుంది. చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి. కీలక సమాచారం అందుతుంది. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. ఆత్మీయుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. ఇరుగు పొరుగుతో సఖ్యత ఏర్పడుతుంది. ప్రయాణం లాభిస్తుంది. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి. రెండో పెళ్లి యత్నం ఫలించదు.
పరిహారం: గణపతిని పూజించండి. బంగారు రంగు కలిసిన దుస్తులను ధరించండి.
మకరం
కొంత జాప్యమైనా పనులు సజావుగానే పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగానే ఉంటాయి. వాహన యోగం ఉంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. చక్కటి వ్యక్తిత్వంతో పెద్దల మన్ననలను పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పురోభివృద్ధి దిశగా సాగించే ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. అనవసర ప్రయాణాలు మానుకోండి. ఆత్మీయుల చికిత్స కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. పొరపాటు చర్యల కారణంగా పరిహారం చెల్లించాల్సి వస్తుంది. నోటిదురుసు మంచిది కాదు. ఎవరికీ హామీగా ఉండకండి.
పరిహారం: శనైశ్చరుడిని నువ్వుల నూనెతో అభిషేకించండి. నల్లటి రంగు కలిసిన దుస్తులను ధరించండి.
కుంభం
వారమంతా శుభప్రదంగా సాగుతుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. ఆనందం వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ఇతరుల నుంచి సహకారం లభిస్తుంది. నిరుద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. సంతాన సంబంధ సౌఖ్యాన్ని పొందుతారు. శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో విందు, వినోదాలకు హాజరవుతారు. ఉన్నత స్థానానికి ఎదిగే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదృష్టం తోడుగా నిలుస్తుంది. వారం మధ్యలో వృథా ఖర్చు ఉంటుంది. అనవసర జోక్యం వద్దు.
పరిహారం: నాగదేవతను పూజించండి. గోధుమ రంగు కలిసిన దుస్తులను ధరించండి.
మీనం
పట్టింది బంగారంలా సాగుతుంది. చేపట్టిన ప్రతి కార్యం సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి. ప్రత్యర్థుల కుట్రలను వమ్ము చేస్తారు. నైపుణ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఉన్నత అవకాశాలను పొందుతారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే ప్రయత్నం, దూర ప్రదేశాల్లో స్థిర నివాస యత్నం అనుకూలిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంతాన సంబంధ శుభవర్తమానం అందుతుంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. వృథా ఖర్చు తగ్గించాలి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. బద్ధకం వద్దు.
పరిహారం: శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించండి. తెల్లటి వస్త్రాలను ధరించండి.