Optical Illusion: మీ ఆలోచన ఎలాంటిదో ఈ ఫొటో చెప్పేస్తుంది.. ఓసారి ట్రై చేసి చూడండి

పైన కనిపిస్తున్న ఫొటోలో రెండు అంశాలు ఉన్నాయి.

Update: 2024-09-26 11:15 GMT

Optical Illusion: మీ ఆలోచన ఎలాంటిదో ఈ ఫొటో చెప్పేస్తుంది.. ఓసారి ట్రై చేసి చూడండి 

మనం చూసే విధానం బట్టి మన ఆలోచనలు ఉంటాయని మానసిక నిపుణులు చెబుతుంటారు. అందుకే ఒక వస్తువును చూపించి, మీరు ఆ వస్తువును ఎలా చూస్తారన్న విషయం ఆధారంగా మీ క్యారెక్టర్‌పై ఓ అవగాహనకు వస్తుంటారు. ఈ ప్రక్రియను పర్సనాలిటీ టెస్ట్‌గా చెబుతుంటారు. సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి పర్సనాలిటీ టెస్టులకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఉన్న ఆ మ్యాజిక్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పైన కనిపిస్తున్న ఫొటోలో రెండు అంశాలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఒక వ్యక్తి చేతి పైకి ఎత్తిన ఫొటో ఒకటి. మరొకటి ఒక వ్యక్తి అరుస్తున్నట్లు ఉన్న ఆకారం. మరి ఈ రెండింటిలో మీకు మొదట ఏం కనిపిస్తోందన్న దాని బట్టి మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు. మరి ఈ రెండింటిలో మొదట ఏది కనిపిస్తే మీరు ఎలాంటి వారో మానసిక నిపుణులు విశ్లేషించారు.

* ఒకవేళ మీకు మొదట ఈ ఫొటోలో పైకెత్తిన చేయి కనిపిస్తే. మీరు సమస్యలను త్వరగా పరిష్కరిస్తారు. ఎంతటి సమస్య ఎదురైనా తెలివితో పరిష్కరిస్తారు. సవాళ్లను స్వీకరించే స్వభావం కలిగి ఉంటుంది. అలాగే సమస్యలు వస్తే భయపడి వాటి నుంచి పారిపోరు. ఎదురొడ్డి నిలబడతారు.

* ఒక మీకు ఈ ఫొటో చూడగానే మీకు అరుస్తున్న వ్యక్తి ముఖం కనిపిస్తే మీరు ఆలోచన తీరు మెరుగ్గా ఉంటుంది. లోతైన ఆలోచన ధోరణిని కలిగి ఉంటారని అర్థం చేసుకోవాలి. ప్రతీ అంశాన్ని సుదీర్ఘంగా ఆలోచిస్తారు. ఏ విషయాన్ని కూడా అంత సులభంగా వదిలి పెట్టరు. ఒక్కసారి పనిని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు వదిలి పెట్టరని మానసిక నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News