Viral Video: కొండ చిలువ, మొసలి మధ్య భీకర పోరు.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే షాక్..!
Python vs Crocodile: మొసలి ఎంత బలమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా నీటిలో ఉంటే దాని శక్తి రెట్టింపు అవుతుంది.

Viral Video: కొండ చిలువ, మొసలి మధ్య భీకర పోరు.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే షాక్..!
Python vs Crocodile: మొసలి ఎంత బలమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా నీటిలో ఉంటే దాని శక్తి రెట్టింపు అవుతుంది. ఇలాంటి మొసలిపై కొండ చిలువ అటాక్ చేయడానికి వస్తే ఏం జరుగుతుంది.? ఏముంది కొండ చిలువ మొసలికి ఆహారంగా మారిపోతుందని అంటారా.? అయితే పరిస్థితి దీనికి భిన్నంగా జరిగింది.
ఇందులో సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఒక మొసలి నీటిలో వేట కోసం వేచి ఉంటుంది. అదే సమయంలో ఒక పెద్ద కొండచిలువ అక్కడికి చేరింది. కొండచిలువ మొసలికి చాలా దగ్గరగా వచ్చేసరికి.. ఒక్కసారిగా మొసలి దానిపై దాడి చేస్తుంది. నోటితో గట్టిగా పట్టుకుంటుంది. ఆ దాడి వల్ల కొండచిలువ కొంతసేపు ఇబ్బంది పడింది.
అయితే కాసేపు కాగానే తేరుకున్న కొండి చిలువ మొసలిపై తిరుగుదాడి మొదలు పెట్టింది. మొసలిని తలచుట్టేసి గట్టిగా పట్టేసింది. కాసేపు వీటి రెండింటి మధ్య తీవ్రంగా పోరాటం జరిగింది. చివరికి ఊహించని విధంగా మొసలే వెనక్కి తగ్గింది. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న దానికి, కొండచిలువను వదిలేయడం మేలన్న ఆలోచన వచ్చివెంటనే నోటిలోంచి విడిచి పెట్టింది.
దీంతో దీంతో కొండచిలువ అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతటి బలవంతమైన మొసలి కూడా ఒక పాము చేతిలో ఓడిపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.