Hotel Room: హోటల్ రూమ్ మధ్యాహ్నం 12 గంటలకు ఎందుకు చెక్ అవుట్ చేస్తారో తెలుసా?
Hotel Room Checkout: సాధారణంగా హోటల్లలో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు చెక్ ఇన్ ఎప్పుడూ మధ్యాహ్నం 12 గంటలకే ఎందుకు చేస్తారో తెలుసా?

Hotel Room Checkout: సాధారణంగా హోటల్లలో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు చెక్ ఇన్ ఎప్పుడూ మధ్యాహ్నం 12 గంటలకే ఎందుకు చేస్తారో తెలుసా?
ఎక్కువ శాతం హోటళ్లు ఎప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు చెక్ అవుట్ ఉంటుంది. సాదరణంగా ఈ సమయంలో మాత్రమే ఎందుకు హోటల్లు చెక్ అవుట్ చేస్తారో మీకు తెలుసా? ఈ మధ్యకాలంలో ఎక్కువ మనం ప్రయాణాలు చేసినప్పుడు ముందుగానే హోటల్ రూమ్ బుక్ చేసుకుంటున్నాం. అందులో చెక్ ఇన్ సమయాలు ముందుగానే చెబుతారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక యాప్ లో కూడా హోటల్ రూమ్ బుక్ చేసుకునే సదుపాయం ఉంది. అయితే మీరు ఎప్పుడైనా చెక్ అవుట్, చెక్ ఇన్ సమయాన్ని గమనించారా? ఎప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు చెక్ అవుట్ ఎందుకు ఉంటుందో తెలుసా ?
ఆ మధ్యాహ్నం రెండు నుంచి చెకింగ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు చెక్ ఇన్ అవ్వచ్చు. అయితే చెక్ అవుట్ చేసేది మాత్రం మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మాత్రమే చెక్ అవుట్ చేయాలి. ఇది 12 గంటల సమయం గడవక ముందే హోటల్ రూమ్స్ చెక్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ప్రధాన కారణం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెక్ అవుట్ చేస్తే బెడ్ షీట్లు మార్చడానికి శుభ్రం చేయడానికి ఇతర పనులకు సమయం లభిస్తుంది. ఈ నేపథ్యంలో సిబ్బందికి ఇబ్బందులు ఎదురవవు. అందరూ ఒకే సమయంలో చెక్ అవుట్ ఇలా ఈ సమయానికి చేయటం వల్ల వాళ్ళు సులభంగా రూమ్ హోటల్ గదులను శుభ్రం చేస్తారు. అయితే ఒక్కో సమయంలో ఒక్కొక్కరు చెక్ అవుట్ చేయడం వల్ల ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు చెక్ ఇన్ అయినా కానీ, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు చెక్ అవుట్ చేయాల్సి కూడా వస్తుంది.
అందుకే హోటల్ రూమ్ చెకి ఇన్ సమయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఉదయం ఆ హడావిడి లేకుండా ఎంచక్కా మధ్యాహ్నం వరకు మీ సామాన్లు కూడా సర్దుకొని చెక్ అవుట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో బుక్ చేసుకోవడం కూడా ఎంతో సులభం హడావిడిగా ఉదయాన్నే పడాల్సిన అవసరం లేదు.