Viral Video: సైకిల్ పంప్‌తో విమానానికి గాలి కొడితే.. వైరల్ అవుతోన్న వీడియో
Viral Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Viral Video: సైకిల్ పంప్‌తో విమానానికి గాలి కొడితే.. వైరల్ అవుతోన్న వీడియో
Viral Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో అరచేతిలో వాలిపోతున్నాయి. ఏమాత్రం విభిన్నంగా ఉన్నా సరే వీడియో క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఇలాంటి ఓ ఆసక్తికరమైన వీడియో నెటిజన్లను అకట్టుకుంటోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
సాధారణంగా విమానాలతో వ్యవహారంతో చాలా ఖర్చుతో కూడుకుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరికి విమానాల టైర్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో గాలిని నింపేందుకు కూడా ప్రత్యేక వ్యవస్థలు ఉంటాయి. అలాంటిది విమాన టైర్లలో సైకిల్ పంపుతో గాలి కొడితే ఎలా ఉంటుంది.? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! అయితే తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఓ చార్టర్ట్ ఫ్లైయిట్ రన్‌వేపై ఆగి ఉంది. విమానం టైర్లలో గాలి లేకపోవడంతో నేరుగా పైలట్ రంగంలోకి దిగాడు. సైకిల్ టైర్లలో గాలి నింపే పంపు సహాయంతో గాలి కొట్టాడు. దీనిని అక్కడే ఉన్న కొందరు స్మార్ట్ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడం మొదలైంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
అతను పైలెటా లేకా పంక్చర్ షాప్ యజమానా అంటూ కొందరు కామెంట్ చేశారు. కాగా మరికొందరు స్పందిస్తూ..ఇతనికి వచ్చిన కష్టం ఆ పగవాడికి కూడా రాకూడదు అంటూ స్పందిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి.