Viral Video: ఈ పాకిస్థానీ చిన్నారి ట్యాలెంట్‌కు ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే.. రోహిత్ శ‌ర్మ‌తో పోల్చుతోన్న నెటిజ‌న్లు

పాకిస్తాన్‌కు చెందిన 6ఏళ్ల చిన్నారి సోనియా ఖాన్ అద్భుతమైన పుల్ షాట్ ఆడి నెట్టింట్లో వైరల్ అయింది. ఈ వీడియోను ప్రముఖ ఇంగ్లాండ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో తన X అకౌంట్‌లో షేర్ చేశారు.

Update: 2025-04-26 10:09 GMT
Viral Video: ఈ పాకిస్థానీ చిన్నారి ట్యాలెంట్‌కు ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే.. రోహిత్ శ‌ర్మ‌తో పోల్చుతోన్న నెటిజ‌న్లు
  • whatsapp icon

పాకిస్తాన్‌కు చెందిన 6ఏళ్ల చిన్నారి సోనియా ఖాన్ అద్భుతమైన పుల్ షాట్ ఆడి నెట్టింట్లో వైరల్ అయింది. ఈ వీడియోను ప్రముఖ ఇంగ్లాండ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో తన X అకౌంట్‌లో షేర్ చేశారు. సోనియా ఆడిన షాట్‌ను చూసిన వారంతా ఆమె బ్యాటింగ్ టెక్నిక్‌పై ఆశ్చర్యపోతున్నారు. ప్రత్యేకించి ఆమె పుల్ షాట్‌ను చూసి నెటిజన్లు భారత బ్యాటింగ్ లెజెండ్ రోహిత్ శర్మను గుర్తు చేసుకుంటున్నారు.

వీడియోలో ఒక వ్యక్తి వేసిన బంతిని సోనియా సమయానికి తగ్గట్టు కలెక్షన్ చేస్తూ అద్భుతమైన పుల్ షాట్ ఆడింది. బ్యాలెన్స్, టైమింగ్ అన్నీ ప్రొఫెషనల్ ప్లేయర్‌లా ఉండడంతో ఈ వీడియో పాపులర్ అయింది. కెటిల్‌బరో కూడా, "పాక్‌కు చెందిన 6ఏళ్ల సోనియా ఖాన్.. రోహిత్ శర్మలా పుల్ షాట్ ఆడుతోంది" అని ప్రశంసించారు.

ఈ వీడియోకు దాదాపు 10 మిలియన్ వ్యూస్, 12వేల కంటే ఎక్కువ లైక్స్ ల‌భించాయి. కామెంట్లలో చాలామంది సోనియా టెక్నిక్‌ను రోహిత్ శర్మతో పోల్చుతూ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు స్పందిస్తూ ఈ చిన్నారి పాకిస్థాన్ ఫ్యూచ‌ర్ క్రికెట‌ర్ కావ‌డం ఖాయ‌మ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.


Tags:    

Similar News