Travel Tips: కేవలం రూ.25 వేలతో ఈ 3 దేశాలకు వేసవి సెలవుల్లో వెళ్లొచ్చు..!
Travel under Budget: వేసవి సెలవులు రేపటితో ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉన్నవారికి ఇది బంపర్ అవకాశం.

Travel Tips: కేవలం రూ.25 వేలతో ఈ 3 దేశాలకు వేసవి సెలవుల్లో వెళ్లొచ్చు..!
Travel Under Budget: విదేశాలకు వెళ్లాలని జీవితంలో ఒక్కసారైనా చూడాలని చాలామందికి అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం మంది ఈ మధ్యకాలంలో ట్రావెల్ చేస్తున్నారు. ప్రధానంగా మన ఇతర రాష్ట్రాల బదులుగా విదేశాలకు వెళ్లిన కానీ తక్కువ బడ్జెట్లో అవుతుంది. దేవాలయాలు సన్ రైజ్ వంటి దృశ్యాలు వీక్షించాలనుకునే వారికి ఇది అద్భుత అవకాశం. ప్రధానంగా ప్రకృతి సౌందర్యం, పవిత్ర జలాలు, పర్వతాలు వంటివి చూడాలనుకునే వారికి అద్భుత అవకాశం అని చెప్పొచ్చు.
విదేశాలకు వెళ్లాలనుకున్న ఫ్యామిలీతో పాటు వెళ్తే ఎక్కువ బడ్జెట్ అవుతుందని చాలామంది ప్రయాణం మానుకుంటారు. అయితే ఒక్కొక్కరికి కేవలం రూ.25 వేలతోనే మీరు విదేశీయానం చేయవచ్చు. అలాంటి మూడు దేశాలు ఉన్నాయి. దీంతో ఎంతో భద్రంగా మీరు విదేశాలకు ట్రిప్ వేసి ప్రకృతి అందాలను తిలకించి వేసవి సెలవులు ఎంజాయ్ చేసి రాగలుగుతారు. ఇక్కడ దేవాలయాలతో పాటు పవిత్ర నదులు, పర్వతాలు, కొండలు, పచ్చని పైర్లు కనులవిందు చేస్తాయి. సన్‌రైజ్ కూడా ప్రత్యేక సముద్ర జలాలతో ఎంజాయ్ చేస్తూ మీరు విదేశీ ట్రిప్ వేయచ్చు.
వియత్నం..
ఎప్పుడూ నేపాల్, థాయిలాండ్, బ్యాంకాక్ మాత్రమే కాకుండా వియత్నం ప్రదేశాలకు కూడా వెళ్తే హాయిగా విహరించవచ్చు. ఫ్రెండ్లీ ప్లాన్ రూ.25 వేల బడ్జెట్ తో సులభంగా వెళ్లి రావచ్చు. ఇక్కడ కాస్మోపాలిటన్ నగరాలు, గ్రామీణ ప్రాంతాలు, సంప్రదాయ ఆధునిక ప్రత్యేకత కలిగింది. ఇక్కడ పర్వతాలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి. వియత్నాం వెళ్లడానికి విమాన ఖర్చు రూ.18 వేల నుంచి రూ.20వేల మధ్యలో ఉంటుంది. ఇక అక్కడ ఒక రోజు వసతి రూ.900 నుంచి రూ.1400 ఉంటుంది. ఇక్కడ బీచ్‌లు అందంగా కనిపిస్తాయి.
శ్రీలంక..
విదేశాలకు ట్రిప్ చేయాలనుకుంటే హిందూ మహాసముద్రం గుండా శ్రీలంక వెళ్లొచ్చు. ఇక్కడ కూడా ఒక్కొక్కరికి రూ.17,000 నుంచి రూ.20వేల మధ్యలో విమాన టికెట్ ధర పడుతుంది. ఇది ఒక్క రోజుకి బస్సు రూ.1500 వరకు ఉండవచ్చు. రాముడు, సీతతో ముడిపడి ఉన్న ఈ ఆసక్తికరమైన ప్రదేశం ప్రతి ఒక్కరికి చూడాలని ఉంటుంది. ఇక్కడి మంచి పర్వత ప్రదేశాలు అందమైన గ్రామాలకు ప్రసిద్ధి. రైల్వే జర్నీ అద్భుతం. ప్రత్యేకంగా క్యాండీ విలేజ్ తో పాటు జాఫ్నా వంటి ప్రదేశాలను తిలకించవచ్చు.
భూటాన్..
భూటాన్ కూడా అద్భుతం. ఇది సంస్కృతికి నిదర్శనం. సాంప్రదాయ ఆచారాలకు నిలువుటద్దం. ఇక్కడ మీరు కేవలం రూ.25 వేల బడ్జెట్ పెట్టుకొని సులభంగా వెళ్లొచ్చు. ఇక్కడి లోయలు వంటివి తిలకించవచ్చు ఇక్కడ కూడా విమాన ఖర్చు రూ.20,000 నుంచి రూ.24 వేల మధ్యలో ఉంటుంది. ఒక్క రోజుకు బస రూ.2000 వరకు ఉండవచ్చు. ఇక్కడ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు మిమ్మల్ని మైమరిపిస్తాయి.