Viral Video: ఈ బుడ్డోడి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. షాకింగ్ వీడియో
Viral Video: బాల్యం అనేది కల్లా కపటం లేని స్వచ్ఛమైన జీవితానికి నిదర్శనం. ఆ సమయంలో ఎలాంటి స్వార్థం లేకుండా, నిజమైన ఆనందంతో ప్రతి క్షణం గడుస్తుంది.

Viral Video: ఈ బుడ్డోడి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. షాకింగ్ వీడియో
Viral Video: బాల్యం అనేది కల్లా కపటం లేని స్వచ్ఛమైన జీవితానికి నిదర్శనం. ఆ సమయంలో ఎలాంటి స్వార్థం లేకుండా, నిజమైన ఆనందంతో ప్రతి క్షణం గడుస్తుంది. అందుకే ఎవరైనా ‘ఆ రోజులు మళ్లీ వస్తే ఎంత బాగుండేది’ అనిపించకమానదు. చిన్ననాటి ప్రతి పని ప్రత్యేకమే. తెలిసి తెలియని వయసులో చేసే కొన్ని చూడ ముచ్చటగా అనిపిస్తే, మరికొన్న మాత్రం భయపెడుతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ భయపెట్టే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఇద్దరు చిన్న పిల్లలు (అన్నా,తమ్ములు) బిల్డింగ్ పై ఫ్లోర్‌లోని ఓ రూమ్‌లో ఆడుకుంటున్నారు. ఇదే సమయంలో చిన్నారి కిటికీలోంచి బయటికి వచ్చేసింది. కిటికీ బయట ఉన్న చిన్నస్థలంలో నిలబడి ఆడుతున్నాడు. పొరపాటున కింద పడితే ప్రాణాలే పోయే ప్రమాదం ఉండేది.
అయితే తమ్ముడు కింద పడిపోతున్న విషయాన్ని గమనించిన మరో చిన్నారు సమయస్ఫూర్తితో స్పందించి వెంటనే కిటికీ నుంచి బయటకు వచ్చి ఆ చిన్నారిని లోపలికి తీసుకెళ్లాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ చిన్నారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. చిన్న పిల్లలను అలా వదిలేసిన పేరెంట్స్‌కి బుద్ధి ఉండాలంటూ మరికొందరు స్పందిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.