Optical Illusion: మీ ఐక్యూ పవర్‌కి టెస్ట్.. ఈ 3 ఫొటోల్లో భిన్నంగా ఉన్న ఫొటోను కనిపెట్టండి..!
Optical Illusion: శరీరం యాక్టివ్‌గా ఉండాలంటే వ్యాయామం చేయాలని తెలిసిందే. అలాగే మెదడు యాక్టివ్‌గా ఉండాలంటే కూడా ఒక పని చేయాలి.

Optical Illusion: మీ ఐక్యూ పవర్‌కి టెస్ట్.. ఈ 3 ఫొటోల్లో భిన్నంగా ఉన్న ఫొటోను కనిపెట్టండి..!
Optical Illusion: శరీరం యాక్టివ్‌గా ఉండాలంటే వ్యాయామం చేయాలని తెలిసిందే. అలాగే మెదడు యాక్టివ్‌గా ఉండాలంటే కూడా ఒక పని చేయాలి. అదే మెదడుకు పని పెట్టడం. మెదడుకు పని పెట్టడం అంటే పజిల్స్‌ను సాల్వ్ చేయడం. ఒకప్పుడు ఇలాంటి పజిల్స్ కేవలం న్యూస్ పేపర్లలో మాత్రమే కనిపించేవి. అయితే ప్రస్తుతం మారిన కాలంతో పాటు.. పజిల్స్ సోషల్ మీడియాలో కూడా వచ్చేస్తున్నాయి.
ప్రతీరోజూ నెట్టింట ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన పజిల్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో అందులో అంతలా ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
పైన ఉన్న ఫొటో చూడగానే మూడు ఫొటోలు కనిపిస్తున్నాయి కదూ! అందులో రెండు ఒకేలా ఉన్నా, మూడోది మాత్రం కాస్త భిన్నంగా ఉంది. ఆ భిన్నమైన బొమ్మ ఏదో మీరు గుర్తించాలి. అయితే మీకున్న టైం కేవలం 12 సెకన్లు మాత్రమే. 12 సెకన్లలో ఈ తప్పును గుర్తిస్తే మీ కంటి చూపుతో పాటు, ఐక్యూ పవర్ కూడా సూపర్ అని చెప్పొచ్చు. మరెందుకు ఆలస్యం ఓసారి ట్రై చేయండి.
ఏంటి భిన్నంగా ఉన్న ఆ ఫొటోను ఇంకా కనిపెట్టలేదా.? ఫొటోలో ఉన్న బాలుడు ధరించిన షూలను జాగ్రత్తగా గమనిస్తే సమాధానం దొరుకుతుంది. ఇప్పటికీ పజిల్‌ను సాల్వ్ చేయలేకపోయారా.? అయితే సమాధానం కోసం కింద కనిపిస్తున్న ఫొటోను చూసేయండి. టైమ్‌లో సాల్వ్ చేసిన వారు గొప్ప దృష్టిశక్తి, వేగవంతమైన ఆలోచనా శక్తిని కలిగి ఉన్నవారని అర్థం.