Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఈ 5 వస్తువులు కొంటే ఇంట్లో అదృష్టం పెరుగుతుంది!
Akshaya Tritiya Auspicious Things: అక్షయ తృతీయ రోజు కొన్ని శుభకరమైన వస్తువులు కొనుగోలు చేసే ఆచారం ఉంది. ఆ రోజు ఎలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే మంచిది తెలుసుకుందాం.

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఈ 5 వస్తువులు కొంటే ఇంట్లో అదృష్టం పెరుగుతుంది!
Akshaya Tritiya Auspicious Things: అక్షయ తృతీయ రోజు కొన్ని శుభకరమైన వస్తువులు కొనుగోలు చేసే ఆచారం ఉంది. ఆ రోజు ఎలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే మంచిది తెలుసుకుందాం.
అక్షయ తృతీయ ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వస్తుంది. ఈరోజు కొన్ని శుభకరమైన వస్తువులు కొనుగోలు చేస్తే ఇంటికి అదృష్టం వస్తుంది అనే నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ఇతర వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే అక్షయ తృతీయ రోజు ఈ 5 వస్తువులు కొనుగోలు చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది.
అంతేకాదు అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేసే అలవాటు చాలామందికి ఉంది. ఈరోజు లక్ష్మీదేవి కుబేరులకు కూడా పూజ చేస్తారు. ఇది అందుకే అదృష్టాన్ని తీసుకువస్తుంది. అక్షయ తృతీయ అంటే ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు ఈ నేపథ్యంలో మీకు శుభాలు జరుగుతాయి.
అక్షయ తృతీయ రోజు మీరు వాహనాలు కొనుగోలు చేయడం కూడా మంచిది. ఈరోజు ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తారు, కొత్త కార్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కొనుగోలు చేయడం వంటివి చేస్తే శుభకరం.
అక్షయ తృతీయ రోజు స్మార్ట్ ఫోన్ లాప్ టాప్ వంటివి కూడా కొనుగోలు చేస్తారు. ఈరోజు అదృష్టం ఇంటికి ఆహ్వానించినట్టే ఈ పవిత్రమైన రోజు ఖరీదైన వస్తువులు ఎంతో మంచిది. కొంతమంది స్టాక్స్ లో పెట్టుబడి పెడతారు. ఇది కూడా శుభాన్ని అందిస్తాయి.
ఒక బంగారం కొనుగోలు చేయలేని వారు వెండి వస్తువులు కూడా ఇంటికి తీసుకురావచ్చు. ఇది ఇంట్లో అదృష్టం, శ్రేయస్సును తీసుకువస్తుంది. వెండి వస్తువులు కూడా శుభకరం. వెండి నాణెం, విగ్రహాలు ఇతర వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపాద పెరుగుతుంది.
అక్షయ తృతీయ రోజు అదృష్టం కలిసి రావాలంటే ఇల్లు లేదా భూమి స్థిరాస్తులు వంటివి కొనుగోలు చేయాలి. ఈరోజు ఎంతో శుభకరమైన రోజు ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇవి మాత్రమే కాదు చెక్కతో చేసిన వస్తువులు కొనుగోలు చేయడం కూడా మంచిదని నమ్ముతారు. ఇంట్లోకి ఫర్నిచర్ డైనింగ్ టేబుల్ వంటివి కొనుగోలు చేయొచ్చు.