Viral Video: టీచ‌ర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని.. ఏపీలో షాకింగ్ ఘ‌ట‌న

Viral Video: టీచ‌ర్‌, స్టూడెంట్ మ‌ధ్య ఉండే బంధం ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-04-23 07:27 GMT
Viral Video

Viral Video: టీచ‌ర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని.. ఏపీలో షాకింగ్ ఘ‌ట‌న

  • whatsapp icon

Viral Video: టీచ‌ర్‌, స్టూడెంట్ మ‌ధ్య ఉండే బంధం ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భ‌గ‌వంతుడితో స‌మానంగా గురువును పూజించాల‌ని చెబుతుంటారు. అయితే తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న స‌మాజానికి స‌రికొత్త ప్ర‌శ్న‌ల‌ను సంధిస్తోంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఓ విద్యార్థిని, టీచ‌ర్ మధ్య చోటు చేసుకున్న ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని రఘు ఇంజినీరింగ్ కాలేజీలో జరిగింది. ఒక విద్యార్థి మొబైల్ ఫోన్ ఉపయోగించడంపై ఉపాధ్యాయురాలు హెచ్చరించడంతో వివాదం మొదలైంది. అనంతరం టీచర్ ఆమె ఫోన్ తీసుకుంది. దీంతో విద్యార్థిని టీచ‌ర్‌పైనే దాడికి దిగింది

వివాదం మాటల తూటాలకు పరిమితం కాక, విద్యార్థి చెప్పుతో టీచర్‌పై దాడి చేయడంతో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది. దీనంత‌టినీ అక్క‌డే ఉన్న కొంద‌రు స్మార్ట్ ఫోన్‌లో చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. విద్యార్థిని తీరుపై నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. విద్యార్థుల అసహనానికి, త‌గ్గుతోన్న విలువ‌ల‌కు ఇది నిద‌ర్శ‌మ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. విద్యార్థినిని కాలేజీ నుంచి త‌ప్పించ‌డం లాంటి క‌ఠిన నిర్ణ‌యాలు కాకుండా, ఆమె మాన‌సిక స్థితిని విశ్లేషించాల‌ని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏది ఏమైన ఇప్పుడీ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.



Tags:    

Similar News