Viral Video: చిరుతలా దూసుకొచ్చిన ఎలుగుబంటి.. ప్రాణ భయంతో పర్యాటకులు
Viral Video: ఎలుగుబంటుల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పులులు, సింహాల్లాంటి జంతువులు కూడా ఎలుగుబంటితో ముఖాముఖి తలపడేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి.

Viral Video: చిరుతలా దూసుకొచ్చిన ఎలుగుబంటి.. ప్రాణ భయంతో పర్యాటకులు
Viral Video: ఎలుగుబంటుల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పులులు, సింహాల్లాంటి జంతువులు కూడా ఎలుగుబంటితో ముఖాముఖి తలపడేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి. ఇటీవలి కాలంలో ఎలుగుబంటులకు సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా, ఓ స్పీడ్‌బోట్ వెంట పరిగెత్తిన ఎలుగుబంటి వీడియో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. కొంతమంది పర్యాటకులు బోటులో నదిలో సయన్సు చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అనుకోని విధంగా ఓ ఎలుగుబంటి వారి పడవను గమనించి బోటు వైపు పరిగెత్తింది. దీనిని గమనించిన బోటు సిబ్బంది వెంటనే స్పీడ్ పెంచారు. అయినా ఆ ఎలుగుబంటి చాలా దూరం వరకు బోటును వెంబడించింది. చివరకు బోటు వేగాన్ని మరింత పెంచి ఎలుగుబంటి నుంచి తప్పించుకోగలిగారు.
దీనంతటినీ బోటులో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త భారీగా వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. జంతువులతో జాగ్రత్తగా ఉండాలని, వాటిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఎలుగుబంటికి దొరికితే వాళ్ల పరిస్థితి ఏమయ్యేదో అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.