Viral Video: రీల్స్ చేస్తోన్న యువతికి చుక్కలు చూపించిన కోతి.. ఏకంగా జుట్టు పట్టి ఎంత పనిచేసిందో చూడండి..!
Monkey Viral Video: సాధారణంగా ఊళ్లలో కోతులు ఎక్కువగా ఉంటాయి. ఇవి చేసే పనులు అన్నీ ఇన్నీ కావు. దీంతో విసిగెత్తిపోతారు కూడా..

Viral Video: రీల్స్ చేస్తోన్న యువతికి చుక్కలు చూపించిన కోతి.. ఏకంగా జుట్టు పట్టి ఎంత పనిచేసిందో చూడండి..!
Monkey Viral Video: ఊళ్లు, అడవులు మాత్రమే కాదు కోతులు జనాలు ఎక్కువగా తిరిగే పట్టణ ప్రాంతాల్లో కూడా హల్ చల్ చేస్తున్నాయి. కోతి అంటేనే దాని పనులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఏ క్షణంలో అవి మనపై దూసుకువస్తాయి, స్పందిస్తాయో కూడా తెలీదు. మనం ఎక్కువగా ఆలయాలు ఉన్న ప్రాంతాల్లో కూడా కోతులు చూస్తాం. అక్కడ ప్రసాదం కొబ్బరిచిప్పలు, అరటి పండ్లు ఏవి ఉన్నా లాక్కొని పోతాయి. ఒక్కోసారి కరిచేస్తాయి కూడా.
అయితే, సోషల్ మీడియాలో తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. సాధారణంగా ఉత్తరాదిలో బృందావన్ ప్రాంతాల్లో కోతులు ఎక్కువగా ఉంటాయి. అవి ఇళ్లపై, ఇంటి లోపలికి వచ్చి కూడా సతాయిస్తాయి. దీంతో ఒక్కోసారి విసిగెత్తిపోతారు కూడా .
ఓ సాంగ్‌పై ఇంటి డాబాపై ఓ యువతి డ్యాన్స్ చేస్తూ ఉంది. అప్పుడే అక్కడ ఉన్న కోతి యువతి జుట్టు పట్టి లాగింది. ఇది సోషల్ మీడియాలో నవ్వుల పూవులు పూయిస్తోంది. ఆ యువతి రీల్ చేస్తూ డ్యాన్స్‌లో మునిగిపోయింది. రికార్డింగ్ చేస్తున్న సమయంలో కోతి తన బుద్ధి చూపించింది.
ఈ మధ్యకాలంలో కోతులు ఇలాంటి ఫన్నీ పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఆ అమ్మాయి జుట్టు విరబూసుకుని రీల్స్ చేస్తోంది. మొదట తనని కొట్టడానికి వస్తుందేమో అని చేయి పైకి ఎత్తింది కోతి. అయితే, ఆ యువతి డ్యాన్స్ చేస్తూ కోతిని లెక్క చేయలేదు. దీంతో ఆ కోతి ఆ యువతి జుట్టు పట్టి లాగేసింది. వెంటనే ఆ యువతి జుట్టు కోతి చేతి నుంచి లాగేసుకుని పక్కకు వెళ్లింది.
ఈ వీడియో ఎక్స్ వేధికగా ఘర్ కే కలేష్ అనే పేజీ మీదుగా ఏప్రిల్ 1 వ తేదీన పోస్ట్ చేస్తారు. దీంతో ఆ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కాస్త దూరంలో మరో కోతి కూడా ఉంది. ఇప్పటికే ఈ వీడియోకు 1.3 లక్షల వ్యూస్ కూడా వచ్చాయి. అయితే, ఈ రీల్ ఎక్కడ తీశారు అనే పూర్తి వివరాలు మాత్రం ఇవ్వలేదు.