Viral Video: అక్కడ గాల్లోకి ఎగురుగుతోన్న వాహనాలు.. అసలు కారణం ఏంటో తెలుసా?
Vehicles jumping in air on road: సాధారణంగా రోడ్లపై వాహనాల వేగాన్ని కంట్రోల్ చేయడానికి స్పీడ్ బ్రేకర్లను ఉపయోగిస్తుంటారు. ఇది మనందరికీ తెలిసిందే. అయితే వేగంగా వచ్చే వాహనాలకు రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ ఉందన్న విషయాన్ని తెలియజేసేందుకు ముందుగానే ఇండికేషన్ ఇస్తుంటారు. ఇందులో భాగంగానే సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తుంటారు. అలాగే స్పీడ్ బ్రేకర్లపై వైట్ కలర్ పెయింట్‌తో మార్కింగ్ చేస్తారు. అయితే ఇలాంటి సైన్ బోర్డ్‌లు లేకపోతే ఏం జరుగుతుందో చెబుతోంది ఓ తాజా వీడియో.
ప్రస్తుతం నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. గుర్గావ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఓ స్పీడ్ బ్రేకర్ ఉంది. అయితే పెద్ద హైవే కావడంతో వాహనాలు వేగంగా దూసుకొస్తుంటాయి. కానీ రోడ్డుపై ఎలాంటి సైన్ బోర్డ్ ఏర్పాటు చేయకపోవడం వల్ల వాహనదారులు స్పీడ్ బ్రేకర్‌ను గుర్తించలేకపోతున్నారు. వాహనదారులు స్పీడ్ బ్రేకర్స్ గుర్తించి వేగాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం లేకపోవడంతో ఆ స్పీడ్ బ్రేకర్ ఎక్కిన వాహనాలు అంతే వేగంగా గాల్లోకి లేస్తున్నాయి.
అలాగే వెనకాల వచ్చిన లారీలు కూడా గాల్లోకి ఎగురుతున్నాయి. దీనంతటినీ రోడ్డుపై ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఈ వీడియోను కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం సదరు వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియో ఇలా పోస్ట్ చేశారో లేదో అలా నెటిజెన్స్ తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. అందులో కొంతమంది ఆ స్పీడ్ బ్రేకర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్యం వల్లే కదా ప్రమాదాలు జరిగేవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. లేదంటే గాల్లోకి ఎగిరిన వాహనాలు ముందు వెళ్తున్న వాహనాలపై పడి రోడ్డు ప్రమాదం జరిగే ఆస్కారం లేకపోలేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.