Swiss cow airlifted: గోమాతకు గాయం అయితే హెలికాప్టర్ లో తరలించారు!
Swiss cow airlifted: గాయంతో బాధపడుతున్న తన ఆవును హెలికాప్టర్ లో తరలించిన స్విట్జర్ ల్యాండ్ రైతు వీడియో వైరల్ అవుతోంది.
ఈ ఫోటోలో ఆవు గాలిలో వేలాడుతోంది కదూ. ఇది మామూలుగా చూసిన వెంటనే ఎవారో ఆకతాయిలు.. మనసు లేని వాళ్ళు ఆ మూగాజీవాన్ని గాల్లో వేలాడదీసి ఆనందం పొందుతున్నారని అనిపిస్తుంది. సహజమే.. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటివి చూసి చూసి వెంటనే నెగెటివ్ గా ఆలోచించడం కచ్చితంగా అలవాటుగా మారిపోయింది. అయితే, ఈ ఫోటో వెనుక అంతా పాజితివే ఉంది. గోమాత అని పూజించే మన దేశంలోనూ ఒక ఆవుకు అంత ప్రాధాన్యత ఇవ్వరేమో అనిపించేటటువంటి సంఘటన ఇది.
ప్రముఖ మీడియా సంస్థ డైలీ మెయిల్ కథనం ప్రకారం ఇది స్విట్జర్లాండ్ లో జరిగిన సంఘటన. అక్కడ రైతులకు భూములు కొండల మధ్య ఉంటాయి. ఊరికి దూరంగా ఉంటాయి. అక్కడ ఆవుల్ని సాకడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. పశువులకు ప్రతి ఏడూ ప్రత్యేకంగా 'బోడెన్‌ఫహర్ట్' అనే కార్య్కర్మాణాన్ని నిర్వహిస్తారు. అక్కడికి తమ పశువులను తీసుకువెళతారు. ఈ క్రమంలో అంబ్రోస్ ఆర్నాల్డ్ అనే ఆయన వ్యవసాయంలో భాగంగా పెద్ద ఆవుల మందను పెచుతున్నారు. తన ఆవుల్ని కూడా 'బోడెన్‌ఫహర్ట్' కార్య్కర్మానికి తీసుకువెళ్లాడు. అయితే అక్కడ ఒక ఆవు గాయపడింది. దానిని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ప్రయత్నించారు. అయితే, ఆ ఆవు ఎక్కువ నడిస్తే మరింతగా గాయం తిరగబెట్టే ప్రమాదం కనిపించింది. ఆవుకు మరింత ప్రమాదం జరుగుతుంది అనే సరికి ఆర్నాల్డ్ ఇక ఎక్కువ ఆలోచించలేదు హెలికాఫ్టర్ రప్పించాడు. హెలికాప్టర్ సహాయంతో ఆవును మంద నుంచి వేరుచేసి తరలించారు.
ఇక ఈ ఘటన వీడియో తీసి సమాజిక మాధ్యమాల్లో ఉంచారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. ఎంత డబ్బున్న రైతు అయినా, ఒక ఆవుకోసం అంత ఖర్చు పెట్టి హెలికాప్టర్ లో వైద్యానికి తరలించడం అనేది ఆ రైతు అంబ్రోస్ ఆర్నాల్డ్ వ్యక్తిత్వాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది. గోమాత పట్ల అంత ప్రేమ చూపించిన ఆయన దయాగుణానికి నెటిజనం నీరాజనాలు పడుతున్నారు..
గోమాతను దైవంగా పూజించే మన దేశంలో కూడా గోవుల పట్ల ఇంత ఉదారంగా ఉండే సంఘటనలు దాదాపుగా కనిపించవు. ఎక్కడో స్విట్జర్లాండ్ లో ఓ రైతు చేసిన ఈ పని గోమాతకు మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని చెబుతుంది. ఆ గోవును ఎలా హెలికాప్టర్ లో తీసుకువెళ్ళారో మీరూ చూసేయండి.