Viral Video: పెద్ద సూట్‌కేస్‌తో హాస్టల్‌కి వచ్చిన విద్యార్థి.. అనుమానం వచ్చి ఓపెన్ చేసి చూడగా..
Viral Video: ఏమంటూ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా క్షణాల్లో అర చేతిలో వాలిపోతోంది.

Viral Video: పెద్ద సూట్‌కేస్‌తో హాస్టల్‌కి వచ్చిన విద్యార్థి.. అనుమానం వచ్చి ఓపెన్ చేసి చూడగా..
Viral Video: ఏమంటూ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా క్షణాల్లో అర చేతిలో వాలిపోతోంది. రకరకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రేమించిన అమ్మాయిని తన హాస్టల్‌కు తీసుకొచ్చేందుకు ఓ కుర్రాడు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిన తీరు వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెలితే.. హరియాణాలోని సోనిపట్ ప్రాంతంలో ఉన్న ఓపీ జిందాల్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి పెద్ద సూట్‌కేస్ చేత పట్టుకొని బాయ్స్ హాస్టల్‌లోకి వచ్చాడు. సెక్యూరిటీ గార్డులు అతడిని ఆపి, సూట్‌కేస్‌లో ఏముందని అడిగారు. దుస్తులు, ఇతర వస్తువులు ఉన్నాయని చెప్పాడు. అయితే ఎందుకో అతని మాట తీరులో తేడా ఉందని గుర్తించిన గార్డులు అనుమానంతో సూట్‌కేస్ తెరవాలని కోరారు. కానీ విద్యార్థి నిరాకరించాడు. వెంటనే ఈ విషయాన్ని యాజమాన్యానికి తెలియజేయడంతో వారు సూట్‌కేస్ తెరవగా అందులో ఓ యువతి బయటపడింది.
దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది దీంతో ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అయితే ఆ యువతి కూడా అదే యూనివర్సిటీకి చెందినదా? లేదా బయటి వ్యక్తియా అన్నది ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఈ విషయంపై యూనివర్సిటీ యాజమాన్యం విచారణ జరుపుతుందనీ, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఈ ఘటనపై నెటిజన్లు చిత్ర విచిత్రంగా స్పందిస్తున్నారు.. ‘‘ఈ రోజుల్లో సూట్‌కేసులు కొత్తగా వాడకాల్లోకి వస్తున్నాయ్’’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ విచిత్ర సంఘటనను మీరూ చూసేయండి.