Viral Video: కోడి చేసిన పనికి షాక్ అవుతోన్న నెటిజన్లు.. వైరల్‌ వీడియో..!

Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏ ఆసక్తికర సంఘటన జరిగినా క్షణాల్లోనే మన చేతుల్లోకి వచ్చేస్తోంది.

Update: 2025-04-03 08:10 GMT

Viral Video: కోడి చేసిన పనికి షాక్ అవుతోన్న నెటిజన్లు.. వైరల్‌ వీడియో..!

Rooster Plays Football: సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏ ఆసక్తికర సంఘటన జరిగినా క్షణాల్లోనే మన చేతుల్లోకి వచ్చేస్తోంది. ఇందులో ముఖ్యంగా జంతువులు, పక్షులు చేసే విచిత్రమైన పనులు, అల్లరి చేష్టలు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. కాస్త వెరైటీగా ఉంటే చాలు సోషల్‌ మీడియాలో వీడియోలు తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా కుక్కలు, ఏనుగులు వంటివి ఫుడ్‌ బాల్‌ ఆడుతుండడం చూసి ఉంటాం. ఇలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో నిత్యం ట్రెండ్‌ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ కోడి పుంజు ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పార్కులో ఉన్న ఈ కోడి పుంజుకి బాల్‌ దొరికింది. దాంతో బాల్‌పై ఎక్కి అటు ఇటు బ్యాలెన్స్ చేస్తూ పార్క్ అంతా తిరుగుతూ దాన్ని తిప్పడం ప్రారంభించింది. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్‌లా ఆడుతుండటాన్ని చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇది విపరీతంగా వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ కోడి పుంజును ఫుట్‌బాల్ లెజెండ్ రోనాల్డోతో పోలుస్తూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. "ఇంకొన్ని రోజుల్లో కోడి పుంజు ఫిఫా వరల్డ్ కప్‌లో కనిపిస్తుందేమో!" అంటూ సరదాగా కామెంట్ చేశారు. మరికొందరు "సూపర్ టాలెంటెడ్ పుంజు" అంటూ దాన్ని ప్రశంసిస్తున్నారు. నెట్టింట ట్రెండ్ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


Tags:    

Similar News