Viral Video: బిడ్డ జోలికి వస్తే.. సింహాలైనానా తగ్గేదేలే.. వైరల్ వీడియో..!

Viral Video: ప్రపంచంలో తల్లి ప్రేమను మించింది లేదని చెబుతుంటారు. ఆడతనం ప్రాంతాన్ని బట్టి మారినా అమ్మతనం మాత్రం ఎక్కడైనా ఒకేలా ఉంటుందని చెబుతుంటారు.

Update: 2025-04-12 11:30 GMT
Mother Buffalo Fights Off Lions to Save Her Calf Viral Wildlife Video

Viral Video: బిడ్డ జోలికి వస్తే.. సింహాలైనానా తగ్గేదేలే.. వైరల్ వీడియో..!

  • whatsapp icon

Viral Video: ప్రపంచంలో తల్లి ప్రేమను మించింది లేదని చెబుతుంటారు. ఆడతనం ప్రాంతాన్ని బట్టి మారినా అమ్మతనం మాత్రం ఎక్కడైనా ఒకేలా ఉంటుందని చెబుతుంటారు. తన బిడ్డకు కష్టం వస్తే, ప్రాణాలకు తెగించి మరీ కొట్లాడుతుంది తల్లి. తన శక్తికి మించి సాహసం చేస్తుంది. ఇది కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాదు. జంతువులు కూడా అంతే. తమ బిడ్డ జోలికి వస్తే అస్సలు ఊరుకోవు. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తే తల్లి ప్రేమకు జంతువులు సైతం అతీతులు కాదని నిరూపిస్తోంది.

వివరల్లోకి వెళితే.. ఓ గేదే దూడతో కలిసి మేతకు వెళ్తుంది. అదే సమయంలో కొన్ని సింహాలు అటుగా వచ్చాయి. అవి దూడను లక్ష్యంగా చేసుకుని దానిపై దాడికి సిద్ధమయ్యాయి. అయితే ఊహించని విధంగా తల్లి గేదె వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి వాటిపై విరుచుకుపడింది. సింహాలు దూడను చుట్టుముట్టినా.. తల్లి గేదె ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంది.

దాన్ని చంపేందుకు పలు ప్రయత్నాలు చేసినా.. ప్రతి సారి తల్లి గేదె ధైర్యంగా తలపడింది. ఇంతలో అక్కడికి మరికొన్ని గేదెలు చేరి తల్లిగేదెకు తోడుగా నిలిచాయి. ఒక్కసారిగా గేదెలన్నీ కలిసి సింహాలపై విరుచుకుపడటంతో అవి షాక్‌కు గురై అక్కడినుంచి పారిపోయాయి. చివరికి సింహాలు చేసేదేమీ లేక దూరంగా నిలబడి చూడడానికే పరిమితమయ్యాయి.

ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరు గేదె ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. "ధైర్యం ఉన్నప్పుడు ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొచ్చు" అనే మాటను మరోసారి నిజం చేసిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన మరికొందరు స్పందిస్తూ తల్లి ప్రేమ గొప్పతనం ఇలాంటిది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 


Tags:    

Similar News