Viral Video: నీటి ఏనుగు, మొస‌లి ఎదురుప‌డితే.. చివ‌రికి ఏం జ‌రిగిందో తెలుసా.?

Viral Video: వన్యప్రాణుల ప్రపంచంలో మొసలికి ఉన్న దాడి శక్తి, నీటి ఏనుగుకు ఉన్న శారీరక బలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2025-04-22 06:53 GMT
Viral Video: నీటి ఏనుగు, మొస‌లి ఎదురుప‌డితే.. చివ‌రికి ఏం జ‌రిగిందో తెలుసా.?
  • whatsapp icon

Viral Video: వన్యప్రాణుల ప్రపంచంలో మొసలికి ఉన్న దాడి శక్తి, నీటి ఏనుగుకు ఉన్న శారీరక బలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, ఇవి ఇద్దరూ ఒకేసారి ఒకేచోట ఎదురెదురుగా వస్తే ఏం జరుగుతుంది? ఇలాంటి ఓ అరుదైన సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ ఈ రెండింటిలో ఏది గెలిచిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఓ వన్యప్రాంతంలో మొసలి నీటికెదురుగా, వేట కోసం ఎదురుచూస్తూ కనిపిస్తుంది. అంతలో నీటిలోంచి ఓ భారీ నీటి ఏనుగు (Hippopotamus) బయటకు వ‌చ్చింది. దాన్ని చూసిన మొసలి ఏ మాత్రం ఆలోచించకుండా నోరు తెరిచి దాడికి ప్రయత్నించింది. కానీ ఇది చూసిన నీటి ఏనుగు ఒక్కసారిగా గంభీరంగా నోరు తెరిచి శబ్దం చేసింది. ఆ శబ్దంతో దెబ్బ‌కు ద‌డుసుకున్న మొస‌లి వెనక్కి తిరిగి పారిపోయింది.

ఇదంతా అక్క‌డున్న సంద‌ర్శ‌కుల ముందే జ‌రిగింది. దీంతో త‌మ చేతిలోని ఫోన్‌ల‌లో ఈ సంఘ‌ట‌ను రికార్డ్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది వీడియో కాస్త క్ష‌ణాల్లో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వీడియోకు 13.7 మిలియన్లకు పైగా వ్యూస్, లక్షల లైక్స్ సాధించి తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. మ‌నం ఎంత బ‌ల‌మైన వాళ్లం అనేది ముఖ్యం కాదు, మ‌నం ఎంత బ‌ల‌మైన వారితో పోటీ ప‌డుతున్న‌మ‌న్న‌ది ముఖ్య‌మ‌ని ఒక యూజ‌ర్ స్పందించ‌గా.. నిజంగా నీటి ఏనుగు ప‌వ‌ర్ సూప‌ర్ అంటూ మ‌రో యూజ‌ర్ కామెంట్ చేశాడు. నెట్టింట తెగ వైర‌ల్ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. 


Tags:    

Similar News