Jallianwala Bagh M*assacre: కొందరు బావిలో దూకి చనిపోయారు.. ఇంకొందరని పట్టల్లా కాల్చిపారేశారు.. బ్రిటిష్ రక్తపాతానికి 106ఏళ్లు!
Jallianwala Bagh M*assacre: బ్రిటిష్ సామ్రాజ్యపు అసలైన ముఖం అక్కడే తొలిసారి నిజంగా బయటపడింది.

Jallianwala Bagh M*assacre: 1919 ఏప్రిల్ 13.. ఇండియాలో చరిత్రలో చీకటి రోజు. అమృతసర్‌లోని జల్లియన్‌వాలా బాగ్ అనే బహిరంగ ప్రాంగణంలో బైసాఖీ పండుగను జరుపుకునేందుకు వచ్చిన వేలాది మంది భారతీయుల మీద బ్రిటిష్ సైన్యం ఊహించని రక్తపాతం సృష్టించింది. చుట్టూ ఎత్తైన గోడలు, అరుదైన ఎగ్జిట్‌లు, ఆ ప్రదేశం మానవ మృత్యుభూమిగా మారిపోయింది. హెచ్చరికలు లేకుండా జెనరల్ డయ్యర్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యం దాదాపు 10వేల మందిపై బుల్లెట్ల వర్షం కురిపించింది. కేవలం పది నిమిషాల్లో 1,650 రౌండ్లు పేల్చారు. కొందరు బయటకు దూకేందుకు ప్రయత్నించి మృత్యువాత పడ్డారు, మరికొంతమంది బాగ్ మధ్యలోని బావిలోకి దూకి చనిపోయారు. అధికార లెక్కల ప్రకారం 379 మంది మరణించారు, కానీ నిజానికి వేల మందికిపైగా నిశ్శబ్దంగా మట్టిలో కలిసిపోయారు. ఇది ఒక మారణహోమంజ ఇది మానవత్వాన్ని నీచంగా తొక్కేసిన ఘోర సంఘటన. అల్లర్ల పేరుతో నగరానికి నీళ్లు, విద్యుత్ తీయడం, పాశవికంగా బెదిరింపులు చేయడం... బ్రిటిష్ ప్రభుత్వం తన క్రూరత్వాన్ని పరాకాష్టకు తీసుకెళ్లింది.
ఈ ఘటన తర్వాత భారత్ పూర్తిగా మేల్కొన్నది తిరిగి నిద్రలేచింది. అప్పటి వరకూ బ్రిటిష్ పాలనను సహించగలిగిన వాదులు కూడా తమ నమ్మకాన్ని కోల్పోయారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తన సర్ బిరుదు త్యజించగా, గాంధీజీ బ్రిటిష్ పాలనను సవాల్ చేస్తూ పోరాటానికి నడిపించారు. జల్లియన్‌వాలా బాగ్ నరహంతకుడు డయ్యర్ అనిపించినా, నిజమైన వెనుకన ఉన్న నెత్తుటి చేతులు మైకేల్ ఓడ్వయర్‌యే. అదే నిజాన్ని గుర్తించిన ఉదమ్ సింగ్, రెండు దశాబ్దాల తరువాత, లండన్‌లోని క్యాట్టక్స్‌న్ హాల్‌లో ఓడ్వయర్‌ను కాల్చి చంపాడు.ఆజాద్ అనే పేరుతో అతను భారత దేశపు ఐక్యతను చాటగా, 1940 జూలై 31న బ్రిటన్ అతనిని ఉరితీసింది. కానీ ఉదమ్ సింగ్ ఆత్మ జల్లియన్‌వాలా బాగ్‌లో శాశ్వతంగా నిలిచింది. అతను ఒక విరాట యోధుడిలా మిగిలిపోయాడు.
ఈ ఘటన జరిగి నేటికి 106 సంవత్సరాలు. కానీ ఇంకా ఆ బాగ్ గోడలపై చెదిరిన అరుపులు, భయంతో పరిగెత్తిన పాదాల గుర్తులు, బుల్లెట్ గాయాల రక్తపు మరకలు ఇప్పటికీ సజీవంగా నిద్రలేని రాత్రిలా మనని వెంటాడుతూనే ఉంటాయి. జల్లియన్‌వాలా బాగ్ అంటే ఒక బాధ, బలిదానం, నిగ్రహం, తిరుగుబాటు, భారత స్వాతంత్య్ర పోరాట నిత్య స్ఫూర్తి.