Aliens: భూమిపై మరో ప్రపంచం.. ఆ ప్రాంతంలో ఏలియన్స్!

Aliens: ఏరియా 51 లోంచి ఒక పోర్టల్ ఉంది. అది మానవుల కంటికి కనిపించదు.

Update: 2025-04-13 04:30 GMT
Aliens

Aliens: భూమిపై మరో ప్రపంచం.. ఆ ప్రాంతంలో ఏలియన్స్!

  • whatsapp icon

Aliens: అమెరికాలోని నీవాడా మైదానాల్లో, ఎప్పుడో నుంచీ రహస్యంగా ఉన్న ప్రాంతం.. ఏరియా 51. ఇది యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అత్యంత గోప్యమైన స్థలం. కానీ, ఇప్పుడు గూగుల్ ఎర్త్ లో కనిపించిన ఓ ఫొటోతో ఆ ప్రాంతం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఒక త్రికోణాకార నిర్మాణం, భూమిపై ఒక పెద్ద నీడను పడేస్తోంది. ఇది కేవలం ఓ టవర్‌ మాత్రమేనా? లేక ఇది మన మానవ మేధస్సుకు అందని బహిర్గత శక్తులకి ఆధారమా? కొంతమంది దీన్ని "UFO ఛార్జింగ్ స్టేషన్", మరికొందరు 'ఎలియన్ల ల్యాండింగ్ మార్క్' అని పిలుస్తున్నారు. ఇది ఆజ్కబాన్ జైలులా ఉందంటుంటే.. మరికొందరు దీన్ని 'టొబ్లెరోన్ టవర్'గా ముద్ర వేసారు.

ఇది న్యూ మెక్సికోలో 1947లో జరిగిన రోస్వెల్ యూఎఫ్ఓ ఘటనను గుర్తుకు తెస్తోంది. అప్పటినుంచి అనేకమంది రహస్యంగా భూమిపైకి వచ్చిన జీవుల గురించి చెప్పుకొస్తున్నారు. ఒక మిస్టిక్ అయితే, "ఏరియా 51 లోంచి ఒక పోర్టల్ ఉంది. అది మానవుల కంటికి కనిపించదు," అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అయితే వాస్తవం ఏంటి? ఇది మామూలు సైనిక నిర్మాణమా? లేక మానవ జ్ఞానాన్ని మించిన రహస్య శక్తుల పని కారమా? మనం చూసే ప్రతి ఉపగ్రహ చిత్రం వెనుక దాగి ఉండే అనేక అర్థాలు ఏమిటి? ఇంకా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. భూమిపై మనం ఒంటరిగా లేమేమో! ఈ టవర్ మానవ కళాఖండం కాదు... అది ఒక సంకేతం కావచ్చు. ఎవరి కోసం అంటే? ఈ బ్రహ్మాండంలో ఇంకెవరైనా ఉన్నారో వారికి!

Tags:    

Similar News