Optical Illusion: ఈ ఫొటోలో మొత్తం 3 పిల్లులు ఉన్నాయి.. కనిపెట్టారా.?

Optical Illusion: పజిల్స్‌ను సాల్వ్‌ చేయడంలో ఉండే కిక్కే వేరని చెప్పాలి. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ పజిల్స్‌ను సాల్వ్‌ చేయడానికి ఇష్టపడుతుంటారు.

Update: 2025-04-12 10:30 GMT
Optical Illusion: ఈ ఫొటోలో మొత్తం 3 పిల్లులు ఉన్నాయి.. కనిపెట్టారా.?
  • whatsapp icon

Optical Illusion: పజిల్స్‌ను సాల్వ్‌ చేయడంలో ఉండే కిక్కే వేరని చెప్పాలి. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ పజిల్స్‌ను సాల్వ్‌ చేయడానికి ఇష్టపడుతుంటారు. బ్రెయిన్ టీజర్స్, క్లిష్టమైన పజిల్స్ మనలో ఆలోచనా శక్తిని పెంపొందిస్తాయి. అసలు జీవితం లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడానికి కూడా ఇవి సహాయపడతాయి. అయితే ఒకప్పుడు కేవలం మ్యాగజైన్స్‌, న్యూస్‌ పేపర్లకు మాత్రమే పరిమితమైన ఇలాంటి పజిల్స్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ ఆప్టికల్ ఇల్యూజన్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా పజిల్ ఫొటో, అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. పైన కనిపిస్తున్న ఫొటోలో రెండు పిల్లులు కనిపిస్తున్నాయి. అయితే ఇదే ఫొటోలో మూడో పిల్లి కూడా ఉంది. దానిని కనిపెట్టడమే ఈ ఫొటో పజిల్‌ ముఖ్య ఉద్దేశం.

ఇంతకీ ఆ మూడో పిల్లిని కనిపెట్టారా.? ఈ పజిల్‌లో ఛాలెంజ్ ఏంటంటే, మీరు ఆ మూడో పిల్లిని కేవలం 5 సెకెన్లలో గుర్తించాలి. ఇది సాధించగలిగితే మీ పరిశీలనా శక్తి ఎంత గొప్పదో చెప్పొచ్చు. మరెందుకు ఆలస్యం ఆ మూడో పిల్లిని కనిపెట్టండి. ఏంటి ఎంత ప్రయత్నించినా పిల్లిని కనిపెట్టలేకపోతున్నారా.? అయితే ఓసారి ఫొటో చివరిలో ఉన్న సోఫాను జాగ్రత్తగా గమనించండి. అక్కడే ఆ మూడో పిల్లి నక్కి నక్కి చూస్తోంది. ఇంత క్లూ ఇచ్చినా కనిపెట్టలేకపోతున్నారా.? అయితే సమాధానం కోసం కింద ఉన్న ఫొటోను చూండి.



Tags:    

Similar News