Chanakya Niti: ఈ 5 మందినీ ఎప్పటికీ మీ ఇంట్లోకి అనుమతించకండి
Acharya Chanakya: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి పుస్తకంలో మనుషి సంసార జీవితంతో పాటు అతని జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు, వాటిని ఎలా ఎదుర్కోవాలో చెప్పారు.

Chanakya Niti: ఈ 5 మందినీ ఎప్పటికీ మీ ఇంట్లోకి అనుమతించకండి
Acharya Chanakya: ఆచార చాణక్యుడు ముందుగానే చాణక్య నీతి పుస్తకంలో మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యతో పాటు కొన్ని అనుభవాలను పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను ఇంట్లోకి అనుమతించడం వల్ల అది ఇంటి వినాశనానికే దారితీస్తుందని చెప్పారు. అలాంటి ఐదు మంది వ్యక్తులను ఇంట్లోకి అనుమతించవద్దని సూచించారు. వారు ఎవరో తెలుసుకుందాం..
ఆచార్య చాణక్యుడి ప్రకారం వేదాల జ్ఞానం లేని వారిని ఎప్పటికీ ఇంట్లోకి రానివ్వకూడదని సూచించారు. అప్పట్లో వేద విజ్ఞానం తప్పనిసరి. వేదాలపై సరైన అవగాహన లేని వ్యక్తులతో వాదించడం కూడా పెద్ద సమస్య. అందుకే అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం నయం.
అంతేకాదు ఈ కాలంలో ఎక్కువ మంది స్వార్ధపరులు అయ్యారు. అయితే ఆచార్య చాణక్యుడు ముందుగానే దీన్ని గ్రహించి స్వార్థంతో ఉన్న మీ స్నేహితులను మీ దరి చేరనివ్వకూడదు.. వాళ్ళు స్వప్రయోజనాల కోసం మాత్రమే మీతో మెలుగుతారని ముందుగానే ఊహించి చెప్పాడు. అలాంటి వారి నుంచి ఎప్పటికైనా దూరంగా ఉండాలని సూచించారు.
ఆచార్య చాణక్యుడి ప్రకారం తరచూ ఇతరులను ఉద్దేశపూర్వకంగా బాధపెట్టే వ్యక్తులతో స్నేహం చేయడం ఎన్నటికీ మంచిది కాదు. పశ్చాత్తాపం లేని వ్యక్తులతో మీరు కలిసి ఉండటం వల్ల మీ జీవితంలో కూడా అనుకొని అగాధాలు వచ్చి పడతాయి. అందుకే అలాంటి వ్యక్తులను మీ దరిచేరనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక ఆచార్య చాణక్యుడు చెప్పిన మరో నిజం ఏమిటంటే.. ఎప్పుడు ప్రతికూల ఆలోచనలతో ఉన్న వ్యక్తులను కూడా దగ్గరకు రానివ్వకూడదు. అలాంటి వారు మనపై కూడా నెగెటివిటీని పెంచుతారు. ఈ నేపథ్యంలో మన జీవితంలో కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.
అంతేకాదు ఆచార్య చాణుక్యుడు ప్రకారం కొంతమంది మన ముందు ఒక మాట మాట్లాడతారు. వెనుక వేరేలా మాట్లాడుతారు. అలాంటి వారిని పక్కన పెట్టుకోవడం వల్ల మనకు ఎప్పటికైనా ఆపదలు పొంచి ఉంటాయి. అది మన కెరీర్ పై కూడా ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో అలాంటి వ్యక్తులను కూడా మనం దగ్గరకు రానివ్వకుండా ఉండాలి.