Viral Video: కొండచిలువను అమాంతం మింగేసిన చిరుత పులి.. షాకింగ్ వీడియో..!
Viral Video: సాధారణంగా పులులు అనగానే జింకలను, గేదెలు, మేకలు వంటి వాటిని వేటాడుతాయని అనుకుంటాం.

Viral Video: కొండచిలువను అమాంతం మింగేసిన చిరుత పులి.. షాకింగ్ వీడియో..!
Viral Video: సాధారణంగా పులులు అనగానే జింకలను, గేదెలు, మేకలు వంటి వాటిని వేటాడుతాయని అనుకుంటాం. మరి పులి, కొండచిలువను వేటాడి తినడం ఎప్పుడైనా చూశారా.? వినడానికే వింతగా ఉన్నా ఈ సంఘటన నిజంగా జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో ఇటీవల జరిగిన ఓ అరుదైన సంఘటన ప్రకృతి ప్రేమికులను ఆశ్చర్యపరుస్తోంది.
ఆకలితో ఉన్న ఓ పులి, ఎదురుగా కనిపించిన ఓ భారీ కొండచిలువను వేటాడి తినేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పులి తినే సాధారణ మాంసాహార జంతువుల్లోకి కొండచిలువలు రావు. కానీ, ఆ పులి ఆ సమయంలో బాగా ఆకలిగా ఉందో ఏమో కానీ పామును తినేసింది. అయితే పామును తినడం వల్ల పులి అస్వస్తతకు గురైనట్లు వీడియోలో స్పష్టమవుతోంది. పామును కాస్త నమిలిన వెంటనే దానిని ఉంచేసి పక్కనే ఉన్న గడ్డి తినడం మొదలు పెట్టింది.
దీనంతటినీ కొందరు టూరిస్టులు తమ కెమెరాల్లో బంధించారు. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. జీవ వైవిధ్యం దెబ్బతింటే ఇలాంటి దారుణాలో చూడాల్సి వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు స్పందిస్తూ నేచరల్ లో ఫుడ్ చైయిన్ సిస్టమ్ దెబ్బ తింటోందని చెప్పేందుకు ఈ వీడియో ఉదాహరణగా నిలుస్తోందని అంటున్నారు.