Hanuman Jayanthi 2025: హనుమాన్ జయంతి ఏడాదిలో రెండుసార్లు ఎందుకు జరుపుకొంటారు?
Hanuman Jayanthi 2025 Celebrations: ఏప్రిల్ 12వ తేదీ రేపు శనివారం హనుమాన్ జయంతి నిర్వహిస్తున్నారు. అయితే ప్రతి ఏడాది రెండు సార్లు హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Hanuman Jayanthi 2025: హనుమాన్ జయంతి ఏడాదిలో రెండుసార్లు ఎందుకు జరుపుకొంటారు?
Hanuman Jayanthi 2025 Celebrations: రేపు ఏప్రిల్ 12వ తేదీ హనుమాన్ జయంతి. చైత్ర మాసంలో పౌర్ణమి తిథి రోజు హనుమాన్ జయంతి నిర్వహిస్తారు. ప్రతి ఏడాది చైత్ర మాసంలో వైభవంగా దేశవ్యాప్తంగా ఈ వేడుకలు జరుపుకుంటారు. హనుమంతుడు అంటేనే ధైర్యానికి ప్రతీక. రాముడికి ఎంతో ప్రియుడు. అయితే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం రెండుసార్లు హనుమాన్ జయంతి ఏడాదిలో నిర్వహిస్తారు. ప్రధానంగా చాంద్రమానం ప్రకారం హనుమాన్ జయంతి ఒకసారి నిర్వహిస్తే.. సూర్యమానం ప్రకారం రెండోసారి నిర్వహిస్తారు. అయితే మొదటగా చైత్ర మాసంలో పౌర్ణమి తిథి రోజు హనుమాన్ జయంతి నిర్వహిస్తారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది చైత్ర మాసంలో హనుమాన్ జయంతి రేపు శనివారం ఏప్రిల్ 12వ తేదీన నిర్వహిస్తారు. ఇక శుభ ఘడియలు ఉదయం 3:21 గంటల నుంచి మరుసటి రోజు 13వ తేదీ ఆదివారం ఉదయం 5:50 గంటల వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి నిర్వహిస్తారు. అయితే హనుమాన్ జయంతి రెండోసారి మార్గశిర అమావాస్య డిసెంబర్ నెలలో కూడా నిర్వహిస్తారు. చాంద్రమానం ప్రకారం ఉత్తరాదిలో ఈ వేడుకలు నిర్వహిస్తారు. బీహార్, ఉత్తర ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఆ సమయంలో నిర్వహిస్తారు. ఇక చైత్ర మాసంలో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాదిలో ప్రధానంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు.
ఆంజనేయుడు అంటేనే ధర్మానికి, సాహసానికి ప్రతీక. శ్రీరాముడిని కలిసిన తర్వాత అతని జీవితమే మారిపోయింది. ప్రధానంగా ఈ అంజనీ పుత్రుడు చిరంజీవుల్లో ఒకరు. హనుమాన్ జయంతి రోజు ఉదయం నిద్ర లేచి పూజలు నిర్వహిస్తారు.ఈ నేపథ్యంలో ఈ రోజున హనుమాన్ చాలీసా పాటించడం ఎంతో ముఖ్యం. 108 సార్లు హనుమాన్ చాలీసా ను పాటించాలని చెబుతారు. ఈరోజు ఆయనకు ఇష్టమైన వడమాల, శనగలు వంటివి సమర్పిస్తారు. ఆలయాల్లో తమలపాకులు కూడా సమర్పించే ఆచారం ఉంది. హనుమాన్ జయంతి అంటే హనుమంతుని పుట్టినరోజు. ఉపవాసాలు చేసే వారు కూడా ఉంటారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీన్ని HMTV Telugu NEWS ధృవీకరించలేదు. ఏ ప్రయత్నాలు అయినా చేసే ముందు నిపుణుల సలహా తీసుకోండి)